Kandula Durgesh: ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్‌

రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు.

Updated : 04 Jul 2024 07:00 IST

ఎస్వీ రంగారావు విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి కందుల దుర్గేష్‌ తదితరులు

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. సినీ నటుడు ఎస్వీ రంగారావు జయంతి సందర్భంగా బుధవారం రాజమహేంద్రవరంలో ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిత్రసీమలో ఎస్వీ రంగారావు తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా నిలిచిపోయారన్నారు. కేవలం తెలంగాణకే సినీ స్టూడియోలు పరిమితమయ్యాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో సైతం ఒక స్టూడియోను ప్రభుత్వ సహకారంతో నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. సాంస్కృతిక నగరంగా పేరొందిన రాజమహేంద్రవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రౌతు సూర్యప్రకాశరావు, పంతం సత్యనారాయణ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకుడు పంతం కొండలరావు, ఎస్వీఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.

ఎస్వీఆర్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నివాళి

ఈనాడు డిజిటల్, అమరావతి: నట వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎస్వీ రంగారావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ కొనియాడారు. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలను పోషించారన్నారు. బుధవారం ఎస్వీఆర్‌ జయంతి సందర్భంగా ఎక్స్‌లో వారు వేర్వేరుగా నివాళులు అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని