Vangalapudi Anitha: విశాఖ జైల్లో గంజాయి ఖైదీలే ఎక్కువ

విశాఖ జైల్లో 2 వేల మంది ఖైదీలు ఉండగా.. వారిలో 1,200 మంది గంజాయి ఖైదీలే ఉండటం విచారకరమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Published : 03 Jul 2024 04:15 IST

హోంమంత్రి వంగలపూడి అనిత
విశాఖలోని కేంద్ర కారాగారం పరిశీలన

మాట్లాడుతున్న హోంమంత్రి వంగలపూడి అనిత

ఈనాడు డిజిటల్‌-విశాఖపట్నం, ఆరిలోవ, న్యూస్‌టుడే: విశాఖ జైల్లో 2 వేల మంది ఖైదీలు ఉండగా.. వారిలో 1,200 మంది గంజాయి ఖైదీలే ఉండటం విచారకరమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గంజాయి నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేశామని, రెండు రోజుల్లో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. విశాఖలోని కేంద్ర కారాగారాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలపై న్యాయనిపుణులతో చర్చిస్తామన్నారు. జైళ్లశాఖను బలోపేతం చేయడంతోపాటు ఖాళీల భర్తీ, అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. దిశ పోలీసు స్టేషన్ల పేర్ల మార్పుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు జైలులో ‘ఎనీ టైం’ క్లినిక్‌ను ప్రారంభించారు. జైలు సూపరింటెండెంట్‌ కిశోర్‌కుమార్, అదనపు సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని