Nalgonda: మాస్టారూ.. మీరే మీరే మాస్టారు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 39 ఏళ్లు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హన్మంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు.

Updated : 30 Jun 2024 06:53 IST

హన్మంతరావును భుజంపై మోస్తున్న శిష్యులు

మ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 39 ఏళ్లు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హన్మంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన శిష్యుల్లో చాలామంది ఏసీపీ, డీఎస్పీ, మున్సిపల్‌ కమిషనర్, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, వ్యాయామోపాధ్యాయులు, పోలీస్‌ కానిస్టేబుళ్లు సహా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొందరు ప్రజాప్రతినిధులుగానూ ఎదిగారు. వారంతా కలిసి నూతనకల్‌ పాఠశాల నుంచి 3 కి.మీ. దూరంలో ఉన్న గుండ్లసింగారం ఫంక్షన్‌హాలులో శనివారం గురువుకు సన్మాన సభ నిర్వహించారు. ఆ పాఠశాల నుంచి హన్మంతరావు, పుష్పలత దంపతులను తీసుకెళ్తున్న వాహనాన్ని శిష్యులైన సుమారు 200 మంది పూర్వవిద్యార్థులు తాడుతో లాగుతూ ఫంక్షన్‌హాలు వరకు తీసుకెళ్లి వినూత్నంగా గురుదక్షిణ చెల్లించుకున్నారు. అనంతరం దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ వాసుదేవ్, ఎల్బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగమల్లు మాట్లాడుతూ.. తాము పోలీసు ఉద్యోగానికి ఎంపిక కావడానికి హన్మంతరావు ఇచ్చిన శిక్షణే కారణమని పేర్కొన్నారు. 

నూతనకల్‌ గ్రామీణం, నూతనకల్, న్యూస్‌టుడే

తమ గురువు హన్మంతరావు దంపతుల వాహనాన్ని తాడుతో లాగుతూ తీసుకెళ్తున్న పూర్వ విద్యార్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని