స్ట్రెంగ్త్‌.. చూపిస్తేనే చేవ!

ఫిట్‌నెస్‌పై మనసు పడే కుర్రకారు ఓ స్థాయి దాటిన తర్వాత స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వ్యాయామాల్ని ఇష్టపడటం మామూలే. ఇవి కేవలం కండలు పెంచేందుకు మాత్రమే కాదు..

Updated : 15 Jun 2024 00:39 IST

ఫిట్‌నెస్‌పై మనసు పడే కుర్రకారు ఓ స్థాయి దాటిన తర్వాత స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వ్యాయామాల్ని ఇష్టపడటం మామూలే. ఇవి కేవలం కండలు పెంచేందుకు మాత్రమే కాదు.. తీరైన శరీరాకృతికి.. దృఢమైన కండరాలకు.. రోగనిరోధకశక్తి పెరిగేందుకు.. ఉపయోగ పడతాయంటున్నారు. కొంచెం వివరంగా చెప్పుకుంటే.. 

  • స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌లో బరువులు ఎత్తడమే ప్రధానం. వీటితో వెన్నెముక, కండరాలు, ఎముకలు, స్నాయువు, కీళ్లు.. ఈ కసరత్తులతో అన్నింటికీ బలం. వాటి ఎదుగుదలకూ ఇదే తోడ్పాటు. కండరబలంతో శరీరంపై నియంత్రణ ఉంటుంది. గాయాలపాలయ్యే అవకాశం తక్కువ. 
  • ఎముకలకు సరైన వ్యాయామం దక్కాలంటే స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలే సరి. ఎముక దృఢమవడమే కాకుండా ప్రమాదకర ఆస్టియోపోరోసిస్‌ రాకుండా కాపాడుకోవచ్చు. వృద్ధాప్యంలో ఎముకలు పెళుసుబారి త్వరగా విరిగి పోతుంటాయి. ఈ క్షీణతను ఆపాలన్నా ఈ కసరత్తులే సరి. 
  • క్రమం తప్పక స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు చేసే వాళ్లలో విశ్రాంతి తీసుకున్నప్పుడు సైతం అధికంగా ఉన్న కేలరీలు కరుగుతాయని ఫిట్‌నెస్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ వర్కవుట్లలో చేసే రెసిస్టెన్స్‌ ఎక్సర్‌సైజ్‌ల కారణంగా బేసల్‌ మెటబాలిక్‌ రేట్‌ (బీఎంఆర్‌) పెరుగుతుంది. దీంతో తొందరగా వృద్ధాప్యం దరిచేరదు. వేగంగా బరువు తగ్గిపోతున్న సందర్భాల్లోనూ కండరాల క్షీణత ఉండదు.
  • భారీ వ్యాయామాల కారణంగా అన్ని భాగాలకూ రక్తప్రసరణ సాఫీగా ఉంటుంది. మధుమేహం దూరమవుతుంది. ఇన్సులిన్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండెజబ్బులు రావు. ఈ కసరత్తులతో వక్షోజ, పెద్దపేగులాంటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. 
  • వ్యాయామంతో మానసిక ఉల్లాసం అనేది ప్రతి ఒక్కరూ చెప్పేమాట. స్ట్రెంగ్త్‌ వ్యాయామాలూ అందుకు మినహాయింపేమీ కాదు. వర్కవుట్లు చేస్తున్నప్పుడు శరీరంలో ఉత్పత్తయ్యే ఎండార్ఫిన్లు మనసుకి హాయినిస్తాయి. ఒత్తిడి తగ్గిస్తాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని