Weekly Horoscope: రాశిఫలం (జూన్‌ 30 - జులై 6)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 30 Jun 2024 00:11 IST


యోగబలం ఉంది. అదృష్టం వరిస్తుంది.  ఉద్యోగులకు పదోన్నతి సూచనలున్నాయి. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. అధికారం వరిస్తుంది. వ్యాపార ఫలితాలు ఆశాజనకం. ప్రత్యర్థులపై మీదే పైచేయి అవుతుంది. సత్వర నిర్ణయాలతో లాభాలను సొంతం చేసు కుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని పెంచుకుంటారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.


ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రుణ సమస్యలు దారికొస్తాయి. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. ఆరు గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. అన్ని విధాలుగా జాగ్రత్తలు అవసరం. మొహమాటానికి పోవద్దు. పొదుపు ప్రాధాన్యం పెంచాలి. నేర్పుగా సంభాషించాలి. ఓర్పు అవసరం. వ్యాపారంలో స్థిర నిర్ణయాలు తీసుకోండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.


శుభప్రదమైన కాలం. మంచి ఫలితాలు సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. కొన్నిసార్లు సాహసమూ అవసరమే. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. ఉద్యోగంలో ఇబ్బందులున్నా, అంతిమ విజయం మీదే.  సూర్యభగవానుడిని ధ్యానించండి.


బుద్ధిబలం అవసరం. గ్రహదోషం అధికం కాబట్టి, అప్రమత్తతతో వ్యవహరించాలి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. చాలా సందర్భాల్లో మౌనమే ఉత్తమం. కొన్ని అభాండాలు ఎదురవుతాయి. ఓర్పు అవసరం. నిర్ణయాల్లో చంచలత్వం వద్దు. ఆత్మవిశ్వాసంతో సంభాషించండి. ఆత్మీయులతో కలహాలు తొలగుతాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.


ఉద్యోగ జీవితంలో కొత్త మలుపులు ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు సఫలం అవుతాయి. పనుల్లోనూ పురోగతి ఉంటుంది. గ్రహదోషం అధికం. వ్యాపారంలో అప్రమత్తత అవసరం. కొంతమేర లాభాలు తగ్గినా ఆందోళన వద్దు. నలుగురికీ సాయపడతారు. ఏకాదశంలోని శుక్ర గ్రహం సంపదల్ని ప్రసాదిస్తుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.


అదృష్టం వరిస్తుంది. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. మనోవాంఛ సిద్ధిస్తుంది. కొత్త ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. శుభ వార్తలు వింటారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల్ని పెంచుకోడానికి సరైన సమయం. నిర్ణయాలను వాయిదా వేయకండి. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. లక్ష్మీదేవిని ఆరాధించండి.


మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. నైపుణ్యాన్ని పెంచుకుంటారు. మనోబలమే మహా జయమని గుర్తించండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంది. కర్మయోగిలా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. అధికారుల అండ లభిస్తుంది. అనవసర సంభాషణలు వద్దు. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.


ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. అంకితభావం ముఖ్యం. ప్రతిభతో నలుగురినీ మెప్పిస్తారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. దీర్ఘకాలిక ఆశయాలు ఈవారం నెరవేరుతాయి. చంచలత్వం వద్దు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ధర్మమార్గంలోనే ప్రయాణించండి. వివాదాలకు అతీతంగా వ్యవహరించండి. వారాంతంలో ఓ శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని స్మరించండి.


మనోబలంతో లక్ష్యాలను సాధిస్తారు. ప్రారంభించిన పనుల్ని పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అశ్రద్ధ వద్దు. తేడా వస్తే, అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. బలమైన వ్యూహాలతో సిద్ధంగా ఉండండి.  నవగ్రహ శ్లోకాలు పఠించాలి.


శుభప్రదమైన సమయం. సకాలంలో పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. దూరమైపోయిన ఆత్మీయులు మళ్లీ దగ్గరవుతారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి.


ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. కార్యసిద్ధి ఉంది. స్పష్టమైన ఆలోచనా విధానం అవసరం. వ్యాపారంలో ధనలాభం సూచితం. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు. శ్రీమహాలక్ష్మిని ధ్యానించండి.


మీ మనోబలమే మిమ్మల్ని కాపాడుతుంది. ఏకాగ్రత అవసరం. ఆర్థిక పురోగతికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులు సంపదల్ని కురిపిస్తాయి. గ్రహదోషం సూచితం. దీనివల్ల ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. కుటుంబ సభ్యులతో సంప్రదించాకే కీలక నిర్ణయాలు తీసుకోండి. విమర్శల్ని పట్టించుకోవద్దు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..