weekly horoscope: రాశిఫలం గ్రహబలం (మార్చి 12 - మార్చి 18)

ఉద్యోగంలో కృషికి తగ్గ ఫలితం ఉంటుంది. బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. సంయమనంతో పనిచేసి పెద్దల ప్రశంసలు పొందుతారు.

Updated : 12 Mar 2023 08:17 IST

weekly horoscope: రాశిఫలం గ్రహబలం (మార్చి 12 - మార్చి 18)


ఉద్యోగంలో కృషికి తగ్గ ఫలితం ఉంటుంది. బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. సంయమనంతో పనిచేసి పెద్దల ప్రశంసలు పొందుతారు. వ్యాపారం బాగుంటుంది. పలుమార్గాల్లో కలిసివస్తుంది. ధనలాభముంది. ఒత్తిడితో ఏ నిర్ణయం తీసుకోవద్దు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభ మవుతాయి. దత్తాత్రేయస్వామిని స్మరించండి, శుభవార్త వింటారు.


శ్రేష్ఠమైన కాలం. అన్నివిధాలా కలిసివస్తుంది. ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. సాధించాల్సిన విషయాలు మనసుకు బోధపడతాయి. పదవీలాభముంది. స్థిరచిత్తంతో నిర్ణయం తీసుకోవాలి. ఆవేశం పనికిరాదు. సంపదలు పెరుగుతాయి. ఇబ్బందులు తొలగుతాయి. ఇంట్లోవారితో సానుకూలంగా వ్యవహరించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి, శక్తి లభిస్తుంది.


ముఖ్యకార్యాలను జాగ్రత్తగా పూర్తిచేయాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. దేనికీ తొందరవద్దు. ఉద్యోగంలో సమస్య వస్తే చాకచక్యంగా వ్యవహరించాలి. కలహాలకు అవకాశమివ్వవద్దు. అపార్థాలకు ఇది సమయం కాదు. స్పష్టమైన ఆలోచనతో విజయం చేకూరేవరకూ శ్రమించాలి. ఇంట్లో వారితో సఖ్యత అవసరం. నవగ్రహస్తోత్రం చదవండి, మేలు జరుగుతుంది.


సకాలంలో పనులు ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. నమ్మకంతో ముందుకెళ్లాలి. ధర్మదేవత అనుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. నిజాయతీ కాపాడుతుంది. నిందలు మోపేవారుంటారు. సున్నితాంశాల్లో స్పష్టత అవసరం. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. సూర్యనమస్కారం శుభాన్నిస్తుంది.


ముఖ్యకార్యాలను శ్రద్ధగా పూర్తిచేయాలి. స్వల్ప ఆటంకాలున్నాయి. శత్రుదోషం ఉంటుంది. శాంతంగా మాట్లాడాలి. కాలం మిశ్రమంగా ఉంది. సమయానుకూలంగా పనిచేయండి, తప్పకుండా కలసివస్తుంది. ఇంట్లోవారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. మనోబలం రక్షిస్తుంది. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. విష్ణుస్మరణ మంచిది.


ఉద్యోగంలో ఉన్నత ఫలితాలుంటాయి. గుర్తింపూ గౌరవం లభిస్తాయి. అధికార లాభం సూచితం. సంపూర్ణ కార్యసిద్ధి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ధనధాన్య ప్రాప్తి ఉంది. బాంధవ్యాలు బలపడతాయి. మిత్రుల వల్ల ఆనందం కలుగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు సాధిస్తారు. దుర్గాదేవిని స్మరిస్తే మేలు జరుగుతుంది.


ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ముందస్తు ప్రణాళికలు అవసరం. నలుగురినీ కలుపుకుపోవాలి. సహనంతో వ్యవహరిస్తే విజయం లభిస్తుంది. ఈర్ష్యపడేవారు ఉంటారు. సౌమ్యంగా సంభాషించండి. నిర్లక్ష్యంగా ఏ పనీ చేయవద్దు. కుటుంబసభ్యుల సూచనలు మేలుచేస్తాయి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.


వ్యాపారలాభం విశేషంగా ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సమయానుకూలంగా నడచుకుంటే ఆపదలు తొలగుతాయి. శక్తికి మించిన నిర్ణయాలు తీసుకోవద్దు. మంచిపేరు వస్తుంది. కొందరు కావాలని గొడవలు సృష్టిస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. వస్తు, వస్త్ర ప్రాప్తి ఉంది. దుర్గామాతను ధ్యానించండి, ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది.


అద్భుతమైన కాలం. శుభఫలితాలుంటాయి. అనేక మార్గాల్లో అభివృద్ధి గోచరిస్తోంది. అవసరాలను బట్టి పనిచేయండి, వెంటనే సత్ఫలితం వస్తుంది. ఉద్యోగం చాలా బాగుంటుంది. సంపదలు వృద్ధిచెందే విధంగా ప్రణాళికలు వేసుకోండి. కుటుంబపరంగా ఆనందించే అంశాలుంటాయి. స్వల్పప్రయత్నంతోనే మంచి గుర్తింపు లభిస్తుంది. లక్ష్మీదర్శనం శుభప్రదం.


వ్యాపారలాభముంది. చక్కని ప్రణాళికతో వెళ్తే ఆశించిన ప్రతిఫలం పొందవచ్చు. ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కలహాలకు అవకాశమివ్వవద్దు. శాంతంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండడం వల్ల మనోబలం లభిస్తుంది. మొహమాటం వద్దు. సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మంచిది.


ఉద్యోగంలో ఉత్తమఫలితం ఉంటుంది. సకాలంలో పనులు పూర్తిచేస్తే ప్రశంసలు లభిస్తాయి. మిశ్రమకాలం నడుస్తోంది. గతానుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి. పట్టుదల, నమ్మకం ముందుకు నడిపిస్తాయి. సంశయం పనికిరాదు. స్థిరచిత్తంతో పనులు పూర్తిచేయాలి. వ్యాపారంలో ఇబ్బందులుంటాయి. ఇతరులపై ఆధారపడవద్దు. శనిభగవానుని స్మరించండి, శుభవార్త వింటారు.


ఉద్యోగంలో కృషిని బట్టి ఫలితం ఉంటుంది. సాహసకార్యాలు విజయాన్నిస్తాయి. తొందర వద్దు. సమన్వయంతో పనిచేయాలి. మిశ్రమకాలం నడుస్తోంది. ఆత్మస్థైర్యం అవసరం. ఇతరుల మాటలు బాధిస్తాయి. అవసరాలకు ఆర్థిక సాయం అందుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆదాయానికి నూతన మార్గాలు వెతకాలి. దక్షిణామూర్తిని ధ్యానించండి, శుభం జరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..