మంచం అమ్మేశా

డాక్టర్‌ గారూ... ఈ మధ్య నాకు నిద్ర సరిగ్గా పట్టడంలేదు. నేను పడుకునే మంచంకింద ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తోంది.

Published : 30 Jun 2024 00:05 IST

రోగి: డాక్టర్‌ గారూ... ఈ మధ్య నాకు నిద్ర సరిగ్గా పట్టడంలేదు. నేను పడుకునే మంచంకింద ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తోంది.

డాక్టర్‌: మీరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు. పదిరోజులు చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

రోగి: ఎంత ఖర్చవుతుందంటారు...

డాక్టర్‌: యాభైవేలు అవ్వొచ్చు.

కొన్నిరోజుల తరువాత...

డాక్టర్‌: ట్రీట్‌మెంట్‌కు రాలేదేం... మీ భయం తగ్గిందా... 

రోగి: మీరు యాభైవేలు అవుతుందన్నారుగా... కానీ మా ఫ్రెండ్‌ ఒక్క సలహాతో నాలోని భయాన్ని మొత్తం పోగొట్టాడు. 

డాక్టర్‌: అవునా... ఏం చెప్పాడు...

రోగి: మంచం అమ్మేసి చాప కొనుక్కోమన్నాడు. ఇప్పుడు నాలో ఏ భయమూ లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..