పార్కిన్సన్స్‌కి ‘ఏఐ’ పరీక్ష!

కీలుకీలులోనూ సూదితో గుచ్చినంత బాధ, చేతులూ కాళ్ళలో వణుకు, కాసేపు నిల్చోవాలన్నా పట్టుతప్పి పడిపోయే ప్రమాదం... ఇవన్నీ పార్కిన్సన్స్‌ లక్షణాలు.

Published : 30 Jun 2024 00:11 IST

కీలుకీలులోనూ సూదితో గుచ్చినంత బాధ, చేతులూ కాళ్ళలో వణుకు, కాసేపు నిల్చోవాలన్నా పట్టుతప్పి పడిపోయే ప్రమాదం... ఇవన్నీ పార్కిన్సన్స్‌ లక్షణాలు. ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షలమంది ఈ సమస్యతో బాధపడుతుంటే ఏటా మూడు లక్షలమంది కన్నుమూస్తున్నారట. మన శరీరాంగాలు ఒకదానికొకటి సమన్వయంతో పనిచేయడం కోసం డోపమైన్‌ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంటుంది. మెదడులో అది స్రవించే చోట వ్యర్థ కణాలు పేరుకుపోయి- వాటి ప్రభావంతో ఆరోగ్యవంతమైన ఇతర కణాలూ క్షీణించడం వల్లే పార్కిన్సన్స్‌ సమస్య వస్తుంది. ఈ సమస్య రావడానికి ఏడేళ్ళ నుంచి మూడున్నరన్నేళ్ళ ముందుగా- దానికి సంబంధించిన ప్రొటీన్‌లు కొన్ని మన రక్తంలో కనిపిస్తాయని శాస్త్రవేత్తలు ఇదివరకే గుర్తించారు. తాజాగా- ఆ ప్రొటీన్‌లని అత్యంత వేగంగా గుర్తించే ఓ కృత్రిమ మేధ(ఏఐ)ని రూపొందించారు యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు. అమెరికాలో వందమంది పైన దీన్ని పరీక్షిస్తే సుమారు 70 మందికి భవిష్యత్తులో ఈ సమస్య వస్తుందని ‘ఏఐ’ చెప్పిందట. అది చెప్పినట్టే - మూడేళ్ళ తర్వాత వాళ్ళలో పార్కిన్సన్స్‌ వ్యాధి రావడం గమనించారు. ఆరకంగా ‘ఏఐ’ వందశాతం కచ్చితంగా రోగనిర్ధారణ చేసినట్టు తేల్చారు. ఇలా ముందుగానే పసిగట్టడం వల్ల మెదడులోని కణాల క్షీణతని సమర్థంగా అడ్డుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..