నడుము నొప్పికి నడక మందు

కొన్ని నడుము నొప్పులకి కారణాలుండవు. ఎముకలు విరగడం, ఇన్ఫెక్షన్‌లకి గురికావడం వంటివేవీ లేకుండానే కొందరు నడుము పట్టేసి ఇబ్బంది పడుతుంటారు.

Published : 30 Jun 2024 00:10 IST

కొన్ని నడుము నొప్పులకి కారణాలుండవు. ఎముకలు విరగడం, ఇన్ఫెక్షన్‌లకి గురికావడం వంటివేవీ లేకుండానే కొందరు నడుము పట్టేసి ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణమేమిటన్నదానిపైన పరిశోధనలు జరుగుతున్నాయి కానీ వాటి ఫలితాలు వచ్చేలోపు ఈ సమస్యకో సులువైన పరిష్కారం సూచిస్తున్నారు ఆస్ట్రేలియాకి చెందిన శాస్త్రవేత్తలు. రోజువారీ నడకతో ఈ సమస్య చాలావరకూ తీరుతుందని చెబుతున్నారు. ఇందుకోసం తరచూ కారణంలేని నడుంనొప్పితో బాధపడుతున్న 708 మందిని ఎంచుకున్నారు. వాళ్ళని రెండు సమాన బృందాలుగా విభజించారు. ఒక బృందాన్ని వైద్యుడి పర్యవేక్షణతో రోజూ కనీసం 30 నిమిషాలు నడవమన్నారు. మరో గ్రూప్‌ని ఇష్టమైతేనే నడకని ఎంచుకోమన్నారు. మూడేళ్ళ తర్వాత వాళ్ళ ఆరోగ్య స్థితిగతుల వివరాలని పరీక్షిస్తే క్రమం తప్పకుండా నడిచినవారిలో మొదటి ఆరునెలలప్పుడు మాత్రమే నడుం నొప్పి కనిపించిందట. ఆ తర్వాత, దాని తీవ్రతతోపాటూ తరచుదనమూ తగ్గిందట! నడవని వారిలో ఎప్పటిలాగే మూణ్ణాలుగు నెలకోసారి రావడం చూశారట. అందుకే నడకని తప్పనిసరి చేసుకోమంటున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..