మెదడుకి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌?!

కాళ్ళూ చేతులు అకస్మాత్తుగా పనిచేయకుంటేనో, మాటల్లో తడబాటు మొదలైతేనో సాధారణంగా మెదడునే పరీక్షిస్తారు వైద్యులు. ఇప్పటిదాకా ఇందుకోసం సీటీ స్కాన్‌, ఎమ్మారై స్కాన్‌లే ఉపయోగిస్తున్నారు.

Published : 30 Jun 2024 00:09 IST

కాళ్ళూ చేతులు అకస్మాత్తుగా పనిచేయకుంటేనో, మాటల్లో తడబాటు మొదలైతేనో సాధారణంగా మెదడునే పరీక్షిస్తారు వైద్యులు. ఇప్పటిదాకా ఇందుకోసం సీటీ స్కాన్‌, ఎమ్మారై స్కాన్‌లే ఉపయోగిస్తున్నారు. ఈ రెండూ కాకుండా- అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ తీస్తే మెదడులోని రక్త ప్రవాహం తీరుతెన్నుల్నీ మరింత చక్కగా చూడొచ్చు. పైగా- ఎమ్మారైతో పోలిస్తే అల్ట్రాసౌండ్‌కి ఖర్చు తక్కువే అవుతుంది. సమస్య ఏమిటంటే- అల్ట్రాసౌండ్‌ తరంగాలు మన పుర్రెని దాటి మెదడులోపలికి వెళ్ళడం కష్టం. వాటిని దాటుకుని వెళ్ళేలా ఇదివరకే రూపొందించిన కొన్ని స్కానర్లు ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదు. తాజాగా- దీనికో పరిష్కారం సాధించారు సౌత్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ఓ చిన్న ఆపరేషన్‌తో ‘పారదర్శక ఫిల్మ్‌’ ఒకదాన్ని పుర్రెని దాటి లోపలికి పంపగలిగారు. ఎమ్మారై స్కాన్‌ కన్నా సూక్ష్మంగా మెదడు తీరుతెన్నుల్ని వాళ్ళు గుర్తించగలిగారు. ఈ ప్రయోగాన్ని ఏ రోగిపైనో చేయలేదు. ఓ మామూలు వ్యక్తి- అతను తన రోజువారీ పనులు చేస్తుండగానే ఈ స్కాన్‌ తీయగలిగారు. ఇందుకోసం రోగి పడుకునే ఉండాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..