ఖాళీగా కూర్చునే పోటీ!

సాధారణంగా ఏవైనా పోటీలు నిర్వహించినప్పుడు అందుకు తగ్గట్టు కష్టపడాల్సి ఉంటుంది. టాస్క్‌ని బట్టి ఆడటమో, పని చేయడమో, ప్రశ్నలకు సమాధానం చెప్పడమో చేయాలి.

Published : 30 Jun 2024 00:34 IST

సాధారణంగా ఏవైనా పోటీలు నిర్వహించినప్పుడు అందుకు తగ్గట్టు కష్టపడాల్సి ఉంటుంది. టాస్క్‌ని బట్టి ఆడటమో, పని చేయడమో, ప్రశ్నలకు సమాధానం చెప్పడమో చేయాలి. కానీ దక్షిణ కొరియాలో నిర్వహించే ఓ పోటీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఏ మాత్రం కష్టపడకుండా, ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చోవడమే ఆ పోటీ. అసలు ఎందుకీ పోటీ అంటే- దక్షిణ కొరియాలో పని లేకుండా ఖాళీగా ఉండటాన్ని వెనకబడినట్లుగా భావించి- ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఒత్తిడి బారిన పడుతున్నారట అక్కడి ప్రజలు. ఆ క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించేందుకే వూప్స్‌యాంగ్‌ అనే విజువల్‌ ఆర్టిస్ట్‌- ‘స్పేస్‌ అవుట్‌ కాంపిటీషన్‌’ పేరిట పోటీ నిర్వహించి- తమ నిబంధనలకు అనుగుణంగా ఖాళీగా కూర్చోగలిగిన వారికి ట్రోఫీని అందజేస్తోంది. దాదాపు గంటన్నరసేపు ఉండే ఈ పోటీలో పాల్గొన్నవారు- నిద్రపోవడం, ఫోను చూడటం, మాట్లాడటం వంటివేమీ చేయకూడదు. ఆ సమయంలో వారి గుండె వేగం నిలకడగా ఉండాలి. పోటీదారుల్ని అన్ని రకాలుగా పరీక్షించి అలా ఉన్నవారినే విజేతలుగా ప్రకటిస్తారు. ఏడాదికోసారి జరిగే ఈ పోటీల్లో ఎనిమిదేళ్ల నుంచి ఎనభై ఏళ్ల వారి వరకూ పాల్గొనొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..