ఆడుతూ ప్రయాణం!

పిల్లలతో ప్రయాణమంటే బాబోయ్‌ అంటారు తల్లిదండ్రులు. కొందరైతే ప్రయాణమే మానుకుంటారు. మరి పిల్లలకు రకరకాల అవసరాలుంటాయి. ఇంటి ¨వాతావరణంలా లేక ప్రయాణంలో ఏడ్చి ఇబ్బంది పెడుతుంటారు.

Published : 30 Jun 2024 00:29 IST

పిల్లలతో ప్రయాణమంటే బాబోయ్‌ అంటారు తల్లిదండ్రులు. కొందరైతే ప్రయాణమే మానుకుంటారు. మరి పిల్లలకు రకరకాల అవసరాలుంటాయి. ఇంటి ¨వాతావరణంలా లేక ప్రయాణంలో ఏడ్చి ఇబ్బంది పెడుతుంటారు. బస్సుల్లో, రైళ్లలో అయితే వారిని ఊరడించడం కష్టమే. అదే సొంత వాహనమైతే కాసేపు పక్కకు ఆపి వాళ్లను బుజ్జగించొచ్చు. ఫిన్లాండ్‌లోని తల్లిదండ్రులకు ఆ అవసరమే లేదు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ప్రయాణానికి రైళ్లనే ఎంచుకుంటారు. పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రుల కోసం అక్కడి రైల్వే వ్యవస్థ ప్రత్యేకమైన బోగీలను ఏర్పాటు చేసింది. అందులో పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలూ, ఊయలలూ, ఇతర ఆట వస్తువులతోపాటు డ్రాయింగ్‌, కథల పుస్తకాలు కూడా ఉంటాయి. పిల్లలు ఆట వస్తువులతోనూ ఇతర పిల్లలతోనూ ఆడుకుంటూ ప్రయాణంలో తల్లిదండ్రుల్ని అస్సలు ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఇదో మంచి ఆలోచన కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..