ఫంగస్‌నే తింటారు!

సాధారణంగా మొక్కజొన్న కంకుల చివరి భాగంలో ఫంగస్‌ వస్తుంది. అలాంటి కంకులు అమ్ముడుపోక రైతులకు నష్టం వాటిల్లుతుంది. అందుకే ఫంగస్‌, ఇతర తెగుళ్లు ఆశించకుండా జాగ్రత్త పడుతుంటారు.

Updated : 30 Jun 2024 00:28 IST

సాధారణంగా మొక్కజొన్న కంకుల చివరి భాగంలో ఫంగస్‌ వస్తుంది. అలాంటి కంకులు అమ్ముడుపోక రైతులకు నష్టం వాటిల్లుతుంది. అందుకే ఫంగస్‌, ఇతర తెగుళ్లు ఆశించకుండా జాగ్రత్త పడుతుంటారు. అదే మెక్సికోలో అయితే ఫంగస్‌ వచ్చిన కంకులకి యమా డిమాండ్‌ ఉంది. పైగా ఆ ఫంగస్‌ కిలో రూ.7000కి అమ్ముడుపోయి రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది. హుయిట్లాకొచే అని పిలిచే ఆ ఫంగస్‌తో చేసే రకరకాల వంటకాలకు మెక్సికోలో క్రేజ్‌ అంతా ఇంతాకాదు. పుట్టగొడుగుల రుచిని  పోలి ఉండే హుయిట్లాకొచే కోసం- రైతులు లేలేత కంకులకు కొన్ని రకాల ఇంజెక్షన్లను ఎక్కిస్తారు. దానివల్ల కంకి ఎదగడంతోపాటు హుయిట్లాకొచే అనే ఫంగస్‌ కూడా పెరిగి పెద్దవుతుంది. సొరకాయ గింజల్ని పోలి ఉండే ఈ ఫంగస్‌ రుచి అమోఘం అంటారు మెక్సికో వాసులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..