ఇల్లరికమే ఆనవాయితీ!

పెళ్లైన ఆడపిల్లలు అత్తగారింటికి కాపురానికి వెళ్లడం మన సంప్రదాయం. ఇల్లరికం వెళ్లేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలోని శివకళై ముదివైతనేందల్‌, పూడూర్‌, పొట్టలూరణి, సెక్కారకుడితోపాటు దాదాపు ఇరవై గ్రామాల్లో మాత్రం- పెళ్లయ్యాక మగవాళ్లే అత్తగారింటికి  వెళ్లాల్సి ఉంటుంది.

Updated : 30 Jun 2024 12:25 IST

పెళ్లైన ఆడపిల్లలు అత్తగారింటికి కాపురానికి వెళ్లడం మన సంప్రదాయం. ఇల్లరికం వెళ్లేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలోని శివకళై ముదివైతనేందల్‌, పూడూర్‌, పొట్టలూరణి, సెక్కారకుడితోపాటు దాదాపు ఇరవై గ్రామాల్లో మాత్రం- పెళ్లయ్యాక మగవాళ్లే అత్తగారింటికి  వెళ్లాల్సి ఉంటుంది. మెట్టినింటికి వెళ్లే ఆడపిల్లలే ఉండరక్కడ. అమ్మాయి ఇంట్లో పెళ్లి జరిగాక అదే రోజు అబ్బాయి ఇంటికి వెళ్లిన వధువు వెంటనే పుట్టింటికి వచ్చేస్తుంది. ఆమెతోపాటు అత్తగారింట్లో అడుగు పెట్టిన వరుడు ఇక అక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. దూరప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడినా సరే వారు అత్తగారి ఊరికి చెందిన వారే అవుతారు. వందల ఏళ్లుగా ఆ గ్రామాల్లో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్న ప్రజలు- పెళ్లైన కూతురికి ఆస్తులతోపాటు ఇల్లు కూడా కట్టించి ఇవ్వాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల్ని చూడాల్సిన బాధ్యత కూతురిదే. మహిళల్ని గౌరవించి ప్రాధాన్యమిచ్చే ఆ గ్రామాల్లో మాతృస్వామ్య వ్యవస్థను చూడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు