‘పండంటి’ చిత్రాలు

కమలాపండ్ల పేరు వినగానే నోరూరిపోతుంది. రుచికి తగ్గట్టే... వంపులు తిరిగిన వాటి తొనలూ చూడచక్కగా ఉంటాయి. కాబట్టే కొందరు కళాకారులు ఈ పండ్లతో బొమ్మల్ని చేసి కనువిందుచేస్తున్నారు.

Published : 30 Jun 2024 00:09 IST

కమలాపండ్ల పేరు వినగానే నోరూరిపోతుంది. రుచికి తగ్గట్టే... వంపులు తిరిగిన వాటి తొనలూ చూడచక్కగా ఉంటాయి. కాబట్టే కొందరు కళాకారులు ఈ పండ్లతో బొమ్మల్ని చేసి కనువిందుచేస్తున్నారు. శిల్పులు రాతిబండతో శిల్పాన్ని మలిచినట్టు ఈ నవతరం కళాకారులు కమలాలతో రకరకాల జీవుల్ని సృష్టిస్తున్నారు. పిల్లికూన, చిట్టిచేప, బుజ్జికుక్క, గున్నఏనుగు, బుల్లిపిట్ట... ఇలా ఒకటేమిటి అన్నింటినీ తొనలూ, తొక్కలతోనే తీర్చిదిద్దారు. ఫ్రూట్‌ కార్వింగ్‌కి అనువైన పండ్ల వరసలో... ఆరెంజ్‌కీ మంచి స్థానాన్ని ఇచ్చేశారు. మరి మీలోనూ కాస్త సృజనా, మరికాస్త ఓపికా ఉంటే మీ కళనూ చూపించేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..