వాళ్లను చూసి కంగారుపడిపోయా!

తెలుగు తెరకు ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’తో పరిచయమైన భామ  ప్రియాంక మోహన్‌. ఇంజినీరింగ్‌ చేసి ఇండస్ట్రీకి వచ్చిన ఈ సొగసరి  ‘ఓజీ’, ‘సరిపోదా శనివారం’తో తెలుగు తెరమీద సందడి చేయనున్న సందర్భంగా తనకు సంబంధించిన విషయాలను చెప్పుకొస్తోందిలా.

Updated : 03 Jun 2024 00:22 IST

తెలుగు తెరకు ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’తో పరిచయమైన భామ  ప్రియాంక మోహన్‌. ఇంజినీరింగ్‌ చేసి ఇండస్ట్రీకి వచ్చిన ఈ సొగసరి  ‘ఓజీ’, ‘సరిపోదా శనివారం’తో తెలుగు తెరమీద సందడి చేయనున్న సందర్భంగా తనకు సంబంధించిన విషయాలను చెప్పుకొస్తోందిలా.


చిన్నప్పటి క్రష్‌

బ్రాడ్‌పిట్‌


ఇష్టమైన నటుడు

రజినీసార్‌. ఆయన నటనే కాదు, నిరాడంబరత కూడా ఇష్టమే. ఏదో ఒక రోజు ఆయన్ని కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.


ఖాళీ దొరికితే...

ఆ సమయాన్ని కేవలం నాకోసమే పెట్టుకుంటా. ఇంట్లోనే హాయిగా విశ్రాంతి తీసుకుంటా. లేదంటే నచ్చిన పనులు చేస్తూ గడిపేందుకు ప్రయత్నిస్తా.


అవి కష్టం...  

పనులుంటే తప్ప నేను పొద్దున్నే నిద్రలేవలేను. అలాగే వ్యాయామం చేయడానికీ అంతగా ఆసక్తి చూపించను. ఈ రెండు అలవాట్లూ నాకు కష్టమే.


వంట చేయడం...

వచ్చు. చికెన్‌ వంటకాలు ఏవైనా సరే చేసేస్తా


అప్పుడు ఇంట్లో చెప్పలేదు

మ్మ కన్నడిగ అయితే... నాన్నది తమిళ నేపథ్యం. నేను పుట్టిపెరిగిందీ, చదువుకున్నదంతా బెంగళూరులోనే. ఇంజినీరింగ్‌లో చేరాక థియేటర్‌ ఆర్ట్స్‌పైన ఇష్టంతో అప్పుడప్పుడూ సరదాగా నాటకాలు వేసేదాన్ని. రెండు మూడు ప్రకటనల్లోనూ నటించా. అప్పుడే స్నేహితులంతా కలిసి తలా కొంచెం డబ్బులు వేసుకుని ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. అప్పటివరకూ నాటకాల్లో నటించిన నేను సినిమా ఎలా తీస్తారనేది తెలుసుకోవాలనుకున్నా. దాంతో ఇంట్లో చెప్పకుండానే అందులో నటించా. అదే కన్నడ సినిమా ‘ఒందు కథే హెళ్లా’. ఆ తరువాత విషయం తెలిసి అమ్మావాళ్లు ఏమీ అనకపోగా ప్రోత్సహించారు. ఆ సినిమానే నాకు ఇతర అవకాశాల్ని తెచ్చిపెట్టింది.


అనుకోకుండానే ఇటువైపు

నేను చదివింది ఇంజినీరింగ్‌. అదయ్యాక ఇంకా పై చదువులు పూర్తిచేసి మంచి ఉద్యోగంలో స్థిరపడాలనేదే నా కల తప్ప అసలు ఇండస్ట్రీవైపు రావాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ ప్రయత్నాలూ చేయలేదు. ఇండస్ట్రీలోకి రాకపోయుంటే ఏదో ఒక కార్పొరేట్‌ సంస్థలో పనిచేస్తూ ఉండేదాన్ని.


ఏడుస్తుంటే చూడాలని..

టులు రకరకాల హావభావాలను పలికించడం తెలిసిందే. నాకు మాత్రం నవ్వు, బాధ, కోపం కన్నా... నేను ఏడుస్తుంటే ఎలా ఉంటానో స్క్రీన్‌పైన చూడాలని కోరిక.


ఆ సందేహం మొదలైంది

నేను చేసిన కన్నడ సినిమా తరువాత నా ఫొటోలు ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’ దర్శకుడు విక్రమ్‌కు చేరాయట. ఆయన నాకు ఫోన్‌ చేసి ఆ సినిమా కథను చెప్పడంతోపాటు చెన్నైలో ఫొటోషూట్‌నూ చేయించారు. ఆ రోజు నేను పెద్ద హీరోయిన్‌ అయినట్లుగానే తెగ సంబరపడిపోయా. ఆ ఫొటోషూట్‌ తరువాత నన్ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌ రమ్మన్నారు. అయితే మొదటిరోజు షూటింగ్‌లో లక్ష్మిగారు, శరణ్యగారు నడుచుకుంటూ వస్తుంటే నాలో కంగారు మొదలైంది. అంత పెద్ద నటులతో తెరను పంచుకునే అర్హత నాకు ఉందా అనే సందేహమూ కలిగింది. దాంతో డైరెక్టర్‌తో ‘బాగా ఆలోచించే నన్ను తీసుకున్నారా... తొందరపడ్డారేమో..’ అనేశా. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఆ సినిమాను పూర్తిచేశా.


సూర్య సినిమాలు చూస్తూ...

మిళంలో నేను శివకార్తికేయన్‌తోపాటు సూర్యతోనూ కలిసి నటించా. చిన్నప్పటినుంచీ హీరో సూర్య సినిమాలను చూస్తూ పెరిగిన నేను తనతో కలిసి ‘ఈటీ’లో నటించబోతున్నానని తెలిసినప్పుడు ఎంత ఆనందించానో చెప్పలేను. ఏదో సాధించిన భావనా కలిగింది. ఆ సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక ఆయన నాకు ఓ గిఫ్ట్‌నూ పంపిస్తే - దాన్ని ఇన్‌స్టాలోనూ పోస్ట్‌ చేసి మురిసిపోయా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు