గత ఏడాది కంటే అధికంగా ఇళ్ల నిర్మాణం

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహ నిర్మాణం గత ఏడాది కంటే పెరిగింది. 2023లో 4.35 లక్షల యూనిట్లు పూర్తయితే... 2024లో 5.31 లక్షల యూనిట్లు పూర్తవుతాయని అనరాక్‌ తన నివేదికలో అంచనా వేసింది. 

Published : 22 Jun 2024 01:22 IST

ఈనాడు, హైదరాబాద్‌ : దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహ నిర్మాణం గత ఏడాది కంటే పెరిగింది. 2023లో 4.35 లక్షల యూనిట్లు పూర్తయితే... 2024లో 5.31 లక్షల యూనిట్లు పూర్తవుతాయని అనరాక్‌ తన నివేదికలో అంచనా వేసింది.

  • బెంగళూరు మినహా మిగిలిన ఆరు నగరాలైన హైదరాబాద్, చెన్నై కోల్‌కతా, ముంబయి, దిల్లీ, పుణెలలో గత ఏడాది కంటే పెరగనున్నాయని అంచనా వేసింది. 
  • హైదరాబాద్‌లో 2023 డిసెంబరు నాటికి 20,500 యూనిట్ల నిర్మాణం పూర్తిచేస్తే ఈ ఏడాది అంచనా 34,770గా ఉంది.
  • మన కంటే వార్షిక ఇళ్ల నిర్మాణం పూర్తిలో పుణె, ముంబయి, దిల్లీ, బెంగళూరు నగరాలు ఉన్నాయి. ముంబయి, దిల్లీలో ఏటా లక్ష ఇళ్ల పైనే కడుతున్నారు. మన దగ్గర ఇప్పటికీ ఆవ్యవస్థీకృత రంగంలో ఎక్కువ గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి లెక్కలోకి రాకపోవడంతో మొత్తం యూనిట్ల సంఖ్య ఎక్కువ కనపడదని ఒక బిల్డర్‌ విశ్లేషించారు. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని