మెట్‌ఫార్మిన్‌ మరో మేలు

మధుమేహం గలవారికి మెట్‌ఫార్మిన్‌ మందును డాక్టర్లు సూచిస్తుంటారు. ఇది ఇన్సులిన్‌ సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. కాలేయం నుంచి విడుదలయ్యే గ్లూకోజు మోతాదులను తగ్గిస్తుంది.

Published : 28 May 2024 00:22 IST

మధుమేహం గలవారికి మెట్‌ఫార్మిన్‌ మందును డాక్టర్లు సూచిస్తుంటారు. ఇది ఇన్సులిన్‌ సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. కాలేయం నుంచి విడుదలయ్యే గ్లూకోజు మోతాదులను తగ్గిస్తుంది. శరీరం గ్లూకోజును గ్రహించు కోవటానికి తోడ్పడుతుంది. అంతేకాదు.. జీర్ణకోశ, రొమ్ము, మూత్రకోశ క్యాన్సర్ల ముప్పు తగ్గటానికీ తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మెట్‌ఫార్మిన్‌ ప్రయోజనాల విషయంలో తాజాగా మరో కొత్త విషయం బయటపడింది. ఇది మైలోప్రొలిఫరేటివ్‌ నియోప్లాజమ్స్‌ (ఎంపీఎన్స్‌) అనే రక్తక్యాన్సర్‌ ముప్పు తగ్గటానికీ దోహదం చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ సమస్య ఎముకమజ్జలోని మూలకణాలు అసాధారణంగా మార్పు చెందటం వల్ల తలెత్తుంటుంది. మెట్‌ఫార్మిన్‌కు వాపు ప్రక్రియను తగ్గించే గుణముంది. క్యాన్సర్లకూ వాపు ప్రక్రియకూ ప్రత్యక్ష సంబంధం ఉండటం వల్ల ఈ అధ్యయన ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని