అదేపనిగా కూర్చుంటున్నారా?

‘క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాం. అయినా బరువు తగ్గటం లేదు. అధిక రక్తపోటు, మధుమేహం, కాలి సిరల ఉబ్బు వంటి సమస్యలతో బాధపడుతున్నాం’ అని చాలామంది వాపోతుంటారు.

Updated : 14 May 2024 02:10 IST

‘క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాం. అయినా బరువు తగ్గటం లేదు. అధిక రక్తపోటు, మధుమేహం, కాలి సిరల ఉబ్బు వంటి సమస్యలతో బాధపడుతున్నాం’ అని చాలామంది వాపోతుంటారు. ఇలాంటి సమస్యలు తగ్గటానికి వ్యాయామం తోడ్పడే మాట నిజమే అయినా ఇదొక్కటే సరిపోదు. గంటల కొద్దీ కదలకుండా అలాగే కూర్చోవటమూ తగ్గించుకోవాలి. రోజుకు 8 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు కూర్చుంటున్నట్టయితే వ్యాయామంతో ఒనగూరే ప్రయోజనాలకు దూరమైనట్టే. కాబట్టి గంటకోసారైనా కుర్చీలోంచి లేచి కాసేపు అటూఇటూ నడవటం అలవాటు చేసుకోవాలి. వీలుంటే కాస్త వేగంగా పరుగెత్తినా మంచిదే.


వేవిళ్లు తగ్గేదెలా?

 గర్భం ధరించిన తొలి నెలల్లో కొందరు వేవిళ్లతో ఇబ్బంది పడుతుంటారు. ఏదీ తినబుద్ధి కాదు. తిన్నా వాంతులు కావొచ్చు. దీనికి ప్రధాన కారణం హార్మోన్ల మార్పులు. గర్భంలో కవలలు ఉండటం, మూత్రకోశ ఇన్‌ఫెక్షన్‌, మధుమేహం వంటివీ వాంతులకు దారితీయొచ్చు. వేవిళ్లు తగ్గటానికి రోజుకు అరగంట సేపు ఆరుబయట నడవటం మంచిది. ఇష్టమైన పదార్థాలే తినాలి. ఒకేసారి ఎక్కువగా తినొద్దు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి. తినబుద్ది కావటం లేదని భోజనం మానెయ్యొద్దు. మసాలా, కొవ్వు పదార్థాలు తినకపోవటమే మేలు. చప్పగా ఉండే అన్నం, ఉడికించిన బంగాళాదుంప వంటివి తినాలి. భోజనానికి భోజనానికి మద్యలో పెరుగు, యాపిల్‌ ముక్కలు, బాదం వంటి గింజపప్పులు చిరుతిండిగా తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. కాఫీ, కూల్‌డ్రింకులు, గూక్లోజు నీళ్లు తాగొద్దు. వేవిళ్లు మరీ ఎక్కువగా వేధిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైతే మందులు సూచిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు