UPSC Civils prelims Results: యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చేశాయ్‌..

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ (UPSC) సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 01 Jul 2024 20:03 IST

దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ (UPSC) సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా జూన్‌ 16న ఈ పరీక్ష నిర్వహించిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) సోమవారం ఫలితాలు విడుదల చేసింది. మెయిన్స్‌ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్‌ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్‌ మార్కులు, ఆన్షర్‌ కీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు తెలిపింది. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

అలాగే, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి  నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సైతం యూపీఎస్సీ ప్రకటించింది. ఐఎఫ్‌ఎస్‌ (మెయిన్‌) పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను విడుదల చేసింది.

ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు