UGC Net Exam: యూజీసీ నెట్‌ పరీక్ష రద్దు: ఎన్‌టీఏ ప్రకటన

యూజీసీ నెట్‌ -2024 పరీక్ష రద్దు చేసినట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.

Updated : 20 Jun 2024 00:00 IST

దిల్లీ: నీట్‌ (NEET) వ్యవహారం కుదిపేస్తున్న వేళ ఎన్‌టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 18న నిర్వహించిన యూజీసీ నెట్‌ -2024 (UGC NET-2024) పరీక్ష రద్దు చేసింది. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డీ లలో ప్రవేశాలకు కోసం జరిగే ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. యూజీసీ నెట్‌ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు  యూజీసీ నిర్ధారణ మేరకు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మంగళవారం 1,205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 9లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షల్లో పారదర్శకతను కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఈ పరీక్షలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.

మరోవైపు, వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నిర్వహించిన నీట్‌ పేపర్‌ లీకేజీపై వస్తోన్న ఆరోపణలపైనా కేంద్రం స్పందించింది. సమయం కోల్పోయిన విద్యార్థులకు కలిపిన గ్రేస్‌ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.  పట్నాలో నీట్‌ అవకతవకలపై పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించింది. ప్రాథమిక ఆధారాల మేరకు నీట్‌లో అవకతవకలు జరిగినట్టు నిర్థరణకు వచ్చామని, బిహార్‌ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని