UGC NET Results: యూజీసీ నెట్‌ ఫలితాలు జనవరి 10న కాదు.. ఎన్‌టీఏ కీలక అప్‌డేట్‌

యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2023 పరీక్ష ఫలితాలను జనవరి 17న విడుదల చేయనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వెల్లడించింది.

Updated : 09 Jan 2024 20:29 IST

దిల్లీ: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తోన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2023 (UGC-NET) ఫలితాలపై NTA కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ పరీక్ష ఫలితాలను జనవరి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్ష ఫలితాలు జనవరి 10న (బుధవారం) ప్రకటించాల్సి ఉండగా.. ఇటీవల చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లో మిగ్‌జాం తుపాను ప్రభావంతో అక్కడి అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా వారికి మరోసారి పరీక్ష నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల UGC NET December 2023 Resultsను జనవరి 17న విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఎన్‌టీఏ మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. 

రామంతాపూర్‌ హెచ్‌పీఎస్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. అర్హతలివే..!

దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను NTA ఏటా రెండు సార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్‌ 6 నుంచి 19వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో UGC NET పరీక్షను నిర్వహించింది. మొత్తం 83 సబ్జెక్టులకు దేశవ్యాప్తంగా 292 నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 9,45,918 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని