TS TET Results: టెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్ చేయండి

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) ఫలితాలు  విడుదలయ్యాయి.

Updated : 27 Sep 2023 12:07 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను తుది ‘కీ’తో పాటు అధికారులు విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

సెప్టెంబర్‌ 15న టెట్‌ పరీక్ష జరగ్గా.. పేపర్‌-1కు 2.26 లక్షల మంది, పేపర్‌-2కు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. టెట్‌ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్‌ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT) జరగనుంది.  

టీఎస్‌ టెట్‌ ఫైనల్‌ ‘కీ’ కోసం క్లిక్‌ చేయండి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని