TS Staff nurse Results: ప్రభుత్వ స్టాఫ్‌ నర్సు పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలో ప్రభుత్వ స్టాఫ్‌ నర్సు ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు  టీఎస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(MHSRB) ప్రకటించింది.

Updated : 18 Dec 2023 20:39 IST

Staff Nurse Results | హైదరాబాద్‌: తెలంగాణలో స్టాఫ్‌నర్సు(Staff Nurse) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 7,094 పోస్టులకు ఆగస్టు 2న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించగా.. దాదాపు 40వేల మంది రాశారు. తాజాగా ఈ పరీక్ష తుది కీతో పాటు ఫలితాలను విడుదల చేసినట్లు టీఎస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(MHSRB) ప్రకటించింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మార్కులు, ఇతర వివరాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు పొందిన పాయింట్లపై అభ్యంతరాలను సోమవారం సాయంత్రం 5.30గంటల నుంచి డిసెంబర్‌ 20లోగా ఆన్‌లైన్‌లో తెలపవచ్చని సూచించింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ప్రాథమిక మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేయనున్నట్లు బోర్డు పేర్కొంది. ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలుస్తామని.. ఒరిజినల్‌ సర్టిఫికెట్లను పరిశీలన అనంతరం ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌/ సెలక్షన్‌ లిస్ట్‌ను విడుదల చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని