SBI clerk Result: ఎస్‌బీఐ క్లర్క్‌ తుది ఫలితాలు వచ్చేశాయ్‌..

ఎస్‌బీఐలో 8773 క్లర్క్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 27 Jun 2024 19:47 IST

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐలో క్లర్క్‌ ఉద్యోగాలకు సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 8,773 జూనియర్‌ అసోసియేట్స్‌ (కస్టమర్‌ సపోర్టు & సేల్స్‌) పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఈ ఏడాది జనవరిలో ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 25, మార్చి 4, జూన్‌ 9 తేదీల్లో మెయిన్‌ పరీక్ష నిర్వహించిన అధికారులు.. తాజాగా తుది ఫలితాలను ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన వారి రోల్‌ నంబర్లతో పీడీఎఫ్‌ను విడుదల చేశారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని