Results: సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌.. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఇలా..

సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Published : 14 Mar 2024 15:25 IST

దిల్లీ: దేశంలోని సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు (AISSEE 2024 Results) విడుదలయ్యాయి. ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాల కోసం జనవరి 28న దేశవ్యాప్తంగా 185 నగరాల్లోని 450 సెంటర్లలో AISSEE 2024 ప్రవేశపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ఈ పరీక్ష కీ విడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు గురువారం ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేసి స్కోర్‌ కార్డు పొందొచ్చు.

స్కోరు కార్డు కోసం క్లిక్‌ చేయండి

సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌ ద్వారానే కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. అంతకుముందు ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు https://pesa.ncog.gov.in/sainikschoolecounselling/landingpage లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌కు దరఖాస్తుల అనంతరం సీట్లు కేటాయింపు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే admission.sss@gov.inకు ఈ మెయిల్‌ చేయవచ్చని అధికారులు సూచించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని