Cochin Shipyard: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు

కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌  మూడేళ్ల కాలానికి 64 ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published : 03 Jul 2024 00:39 IST

కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌  మూడేళ్ల కాలానికి 64 ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగాల్లో..అన్‌రిజర్వుడ్‌కు 29, ఓబీసీలకు 10, ఎస్సీలకు 11, ఎస్టీలకు 10, ఈడబ్ల్యూఎస్‌లకు 4 కేటాయించారు. ఏ విభాగంలో ఎన్ని ప్రాజెక్ట్‌ ఆఫీసర్ల ఖాళీలున్నాయో, వాటికి ఏ విద్యార్హతలుండాలో చూద్దాం. 

1. మెకానికల్‌-38: మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. నౌకా నిర్మాణ సంస్థ/ ఇంజినీరింగ్‌ కంపెనీ/ నౌకాశ్రయం/ ప్రభుత్వ సంస్థలో రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. 

2. ఎలక్ట్రికల్‌-10: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. మెరైన్‌/ ప్రభుత్వ/ పాక్షిక ప్రభుత్వ సంస్థల్లో రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. కంప్యూటర్‌పైన రోజువారీ పనులను చేయగలిగే వారికి ప్రాధాన్యమిస్తారు. 

3. ఎలక్ట్రానిక్స్‌-6: ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ప్రభుత్వ/ పాక్షిక ప్రభుత్వ సంస్థల్లో రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. 

4. సివిల్‌-8: సివిల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. నౌకాశ్రయం/ సివిల్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ/ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలో రెండేళ్ల ఉద్యోగానుభవం తప్పనిసరి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. 

5. ఇన్‌స్ట్రుమెంటేషన్‌-1: ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. నౌకాశ్రయం/ నౌకా నిర్మాణ/ ఇంజినీరింగ్‌ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం. 

6. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-1: కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. రెండేళ్ల ఉద్యోగానుభవం తప్పనిసరి. విండోస్‌ సర్వర్‌ అడ్మినిస్ట్రేషన్‌/ జావా/ నెట్‌వర్క్‌ అండ్‌ టెక్నాలజీస్‌/ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్‌.. వీటిల్లో ఏదో ఒకదానిలో ప్రావీణ్యం ఉండాలి. 

వయసు 30 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్ల మినహాయింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు ప్రభుత్వ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు రూ.700. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీలకు ఫీజు లేదు. 

ఎంపిక ఎలా?

  • ఆన్‌లైన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • ఆన్‌లైన్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో 50 మార్కులకు ఉంటుంది. వ్యవధి 60 నిమిషాలు.
  • జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు - 10 మార్కులు. సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలకు 40 మార్కులు. 
  • ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. 
  • పర్సనల్‌ ఇంటర్వ్యూకు 20 మార్కులు. 
  • పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కు 30 మార్కులు. మొత్తం 100 మార్కులు.
  • అన్‌రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూబీడీలు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. 
  • ఆబ్జెక్టివ్‌ పరీక్షలో అర్హత సాధించినవారి ఒరిజినల్‌ ధ్రువపత్రాలను పరిశీలించి .. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు.
  • పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్, ఇంటర్వ్యూలు రెండిటినీ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్, కొచ్చిలో నిర్వహిస్తారు. 
  • ఆబ్జెక్టివ్‌ టెస్ట్, అనుభవం, పర్సనల్‌ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు. 
  • ఎంపికైనవారికి మొదటి ఏడాది ప్రతి నెలా రూ.37,000, రెండో ఏడాది రూ.38,000, మూడో ఏడాది రూ.40,000 వేతనంగా చెల్లిస్తారు. అదనపు గంటలు పనిచేసినందుకు ప్రతి నెలా రూ.3,000 అందజేస్తారు. 
  • అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాలను బట్టి కాంట్రాక్ట్‌ కాలపరిమితిని పెంచే అవకాశం ఉంటుంది. 

దరఖాస్తుకు చివరి తేదీ: 17.07.2024

వెబ్‌సైట్‌: http://www.cochinshipyard.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని