Engineer Trainee Posts: పవర్ గ్రిడ్‌లో చేరతారా?
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) 435 ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది. గేట్-2024 స్కోరుతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
435 ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) 435 ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది. గేట్-2024 స్కోరుతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులకు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి మెరుగైన ప్రతిభ చూపినవారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
చివరి ఏడాది పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగాల్లో.. ఎలక్ట్రికల్-331, సివిల్-53, కంప్యూటర్ సైన్స్-37, ఎలక్ట్రానిక్స్-14 ఖాళీలు ఉన్నాయి. 31.12.2023 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎక్స్ - సర్వీస్‌మెన్‌కు తాజా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఒక్కో విభాగంలో ఉన్న ఖాళీలు, వాటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హతల వివరాలు చూద్దాం.
ఎలక్ట్రికల్-331: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) అరవై శాతం మార్కులతో పాసవ్వాలి.
సివిల్-53: సివిల్ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి.
కంప్యూటర్ సైన్స్-37: కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇప్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ 60 శాతం మార్కులతో పాసవ్వాలి.
ఎలక్ట్రానిక్స్-14: ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి.
- గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల్లో సమాధానాలు చెప్పడానికి హిందీ లేదా ఇంగ్లిష్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
- గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల సమయంలో గేట్-2024 అడ్మిట్‌కార్డ్, ఒరిజినల్ గేట్ స్కోర్ కార్డ్ తీసుకెళ్లాలి.
- ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో పేర్కొన్న ధ్రువపత్రాలను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి.
- ఇంటర్వ్యూలో అన్రిజర్వ్డ్ 40 శాతం, ఓబీసీ (ఎన్సీఎల్), ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 30 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
- గేట్ స్కోరుకు 85 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 3 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 12 శాతం వెయిటేజీ ఇస్తారు.
- ఆన్లైన్ దరఖాస్తులో గేట్ రిజిస్ట్రేషన్ నంబర్ రాయాలి.
- ఎంపికైనవారిని పవర్గ్రిడ్లోగానీ దాని అనుబంధ సంస్థ అయిన సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీటీయూఐఎల్)లోగానీ నియమించవచ్చు.
- ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత ప్రింటవుట్‌ను భద్రపరుచుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 04.07.2024
వెబ్సైట్: www.powergrid.in/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూజీసీ నెట్-2024 పరీక్ష కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/06/24)
-
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
-
‘కల్కి’ ఆ రికార్డు జస్ట్ మిస్.. ఫస్ట్ డే రూ.100 కోట్లపైన వసూలు చేసిన చిత్రాలివే!
-
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..