Sainik School Key: సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష ఆన్షర్‌ కీ విడుదల

సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ప్రాథమిక కీ ఆదివారం విడుదలైంది.

Updated : 25 Feb 2024 17:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష కీ విడుదలైంది. దేశ వ్యాప్తంగా జనవరి 28న ప్రవేశ పరీక్ష నిర్వహించగా.. తాజాగా ప్రాథమిక కీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పరీక్ష రాసిన విద్యార్థుల అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా కీని పొందొచ్చు. ఈ కీపై ఫిబ్రవరి 27 సాయంత్రం 5.30 గంటల వరకు అభ్యంతరాలు తెలిపేందుకు వీలు కల్పించారు. ఛాలెంజ్‌ చేసేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200 (నాన్‌ రిఫండ్‌) చెల్లించాల్సి ఉంటుంది.

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE -2024) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తోంది.

ప్రాథమిక కీ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు