UGC NET: యూజీసీ నెట్‌ ఫలితాలపై కీలక అప్‌డేట్‌

UGC NET Results: యూజీసీ నెట్‌ ఫలితాలు వచ్చే వారం రోజుల్లోపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌ కుమార్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

Published : 21 Jul 2023 17:05 IST

దిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2023 (యూజీసీ- నెట్‌) పరీక్ష ఫలితాలకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ పరీక్ష ఫలితాలను వచ్చే వారంలో విడుదల చేయనున్నట్టు యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌ కుమార్‌ వెల్లడించారు. జులై 26 లేదా 27 నాటికి ఫలితాలను వెల్లడించడమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) లక్ష్యంగా పెట్టుకుందని ట్విటర్‌లో తెలిపారు. ఇందులో ఏమైనా మార్పులు ఉంటే తాను అప్‌డేట్‌ ఇస్తానని పేర్కొన్నారు.

ఏకలవ్య స్కూల్స్‌లో 10వేలకు పైగా పోస్టులు.. దరఖాస్తు చేశారా?

జూన్‌ 13 నుంచి జూన్‌ 22వరకు ఆన్‌లైన్ విధానంలో UGC NET పరీక్షను నిర్వహించి సంగతి తెలిసిందే.  మొత్తం 83 సబ్జెక్టులకు దేశవ్యాప్తంగా 181 నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 6,39,069 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను NTA ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని