Exam Results: ఐఏఆర్‌ఐ అసిస్టెంట్‌ పోస్టుల టైర్‌-2 పరీక్ష ఫలితాలు విడుదల

ఐఏఆర్‌ఐ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన టైర్‌ 2 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Published : 09 Nov 2023 22:52 IST

దిల్లీ: భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI)లో అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది జూన్‌ 21న నిర్వహించిన టైర్‌ -2 (మెయిన్‌) పరీక్షలో అర్హత సాధించి కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌కు షార్ట్‌లిస్ట్‌ అయినవారి జాబితాను గురువారం ప్రకటించారు. అభ్యర్థులు తమ ఫలితాలను iari.res.in వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. వ్యవసాయ పరిశోధనా సంస్థలో మొత్తం 806 అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి గతేడాది మే 7 నుంచి జూన్‌ 25వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత జులై 29న టైర్‌ 1 పరీక్ష నిర్వహించగా.. 2023 జూన్‌ 21న టైర్‌-2 పరీక్ష నిర్వహించి తాజాగా ఫలితాలు ప్రకటించారు. కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (CPT)కి షార్ట్‌ లిస్ట్‌ అయినవారి స్టేటస్‌ను డిసెంబర్‌ 1 రాత్రి 11.55గంటల వరకు చెక్‌ చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (CPT) టెస్ట్‌కు సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు