నోటిఫికేషన్స్‌

ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో సీనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్, కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Published : 05 Jul 2024 00:34 IST

కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో సీనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్, కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1,049. దరఖాస్తు రుసుము రూ.500. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 14 జులై 2024.


ఇంజినీర్‌ ఉద్యోగాలు

గుజరాత్, ద్వారకలోని ఇండియన్‌ హైవేస్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌ఎంసీఎల్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన ఇంజినీర్‌ (ఐటీఎస్‌), ఆఫీసర్‌ (ఫైనాన్స్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 31. ఆసక్తి ఉన్న వారు 16 జులై 2024 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


జనరల్‌ యూజీ ప్రోగ్రామ్‌

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ/ ఎయిడెడ్‌/ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌/ అటానమస్‌ డిగ్రీ కళాశాలల్లో జనరల్‌ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ‘ఓఏఎండీసీ 2024-25’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రాసెసింగ్‌ ఫీజు రూ.400. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో జులై 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.


నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో సీఎంఎం (లెవల్‌-5) ఇంజినీర్, మిడిల్‌ స్పెషలిస్ట్, జూనియర్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 20. దరఖాస్తు ఫీజు రూ.500. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 18 జులై 2024. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని