తార్కిక సమస్యలకు గణిత పరిష్కారం!

అన్న వయసు ఆరేళ్లు, తర్వాత మూడేళ్లకు తమ్ముడు పుట్టాడు అని చెప్పారు. అప్పుడు చిన్నవాడి వయసు తెలియకపోయినా లెక్కగట్టవచ్చు. ఒక క్రమ శ్రేణిలో తదుపరి సంఖ్యను అంచనాలతో తెలుసుకోవచ్చు. వస్తువుపై ఇరవై శాతం తగ్గింపు అని ప్రకటిస్తే, కొనుగోలు ధరను కనిపెట్టవచ్చు.

Published : 04 Jul 2024 01:12 IST

అన్న వయసు ఆరేళ్లు, తర్వాత మూడేళ్లకు తమ్ముడు పుట్టాడు అని చెప్పారు. అప్పుడు చిన్నవాడి వయసు తెలియకపోయినా లెక్కగట్టవచ్చు. ఒక క్రమ శ్రేణిలో తదుపరి సంఖ్యను అంచనాలతో తెలుసుకోవచ్చు. వస్తువుపై ఇరవై శాతం తగ్గింపు అని ప్రకటిస్తే, కొనుగోలు ధరను కనిపెట్టవచ్చు. ఆ విధంగా సంఖ్యలు, నమూనాల మధ్య సంబంధాలను గుర్తించడానికి, తార్కిక సమస్యలను పరిష్కరించడానికి అరిథ్‌మెటికల్‌ రీజనింగ్‌ పోటీ పరీక్షార్థులకు ఉపయోగపడుతుంది. సంక్లిష్ట గణిత భావనలను అర్థం చేసుకోవడానికి, సమాచారాన్ని విశ్లేషించడానికి, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సాయపడుతుంది.

అరిథ్‌మెటికల్‌ రీజనింగ్‌

వివిధ రకాల పోటీ పరీక్షల్లో తరచుగా అరిథ్‌మెటికల్‌ - రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. వీటిలో చాలా ప్రశ్నలు తార్కిక భావనల ఆధారంగా ఉంటాయి. ప్రశ్నలు సాధించడానికి అభ్యర్థికి అరిథ్‌మెటిక్, రీజనింగ్‌ అంశాలపై పరిజ్ఞానం ఉండాలి. అంతేకాకుండా ఇచ్చిన సమాచారాన్ని చదివి ప్రశ్న అడగడంలో ఉన్న ఉద్దేశం ఏమిటో కనిపెడితే ఎలాంటి పొరపాటు లేకుండా  సమాధానాన్ని గుర్తించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని