కరెంట్‌ అఫైర్స్‌

భారత ఆర్మీకి 30వ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది 2024, జూన్‌ 30న బాధ్యతలు స్వీకరించారు. ఈయన జనరల్‌ మనోజ్‌ పాండే స్థానంలో నియమితులయ్యారు.

Published : 03 Jul 2024 00:57 IST

భారత ఆర్మీకి 30వ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది 2024, జూన్‌ 30న బాధ్యతలు స్వీకరించారు. ఈయన జనరల్‌ మనోజ్‌ పాండే స్థానంలో నియమితులయ్యారు. ఉపేంద్ర ద్వివేది 1964 జులై 1న జన్మించారు. 1984 డిసెంబరు 15న జమ్మూకశ్మీర్‌ రైఫిల్స్‌ రెజిమెంటులో చేరి, వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు.


దేశంలో 2024, జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దాదాపు 150 ఏళ్లుగా అమల్లో ఉన్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్‌), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐఈఏ) స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఏ) వచ్చాయి.


తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన చిప్‌ ఆధారిత 4జీ మొబైల్‌ బేస్‌ స్టేషన్‌ భారత సైన్యానికి చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్‌ట్రాన్‌ ఈ 4జీ బేస్‌ స్టేషన్‌ను భారత సైన్యానికి అందించింది. సహ్యాద్రి ఎల్‌టీఈ బేస్‌ స్టేషన్‌లో ఈ చిప్‌లను, సెమీకండక్టర్‌ సంస్థ సిగ్నల్‌చిప్‌ అభివృద్ధి చేసింది.


కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కు కొత్త ఛైర్మన్‌గా రవి అగర్వాల్‌ నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి. 2025 జూన్‌ వరకు రవి అగర్వాల్‌ సీబీడీటీ ఛైర్మన్‌గా కొనసాగుతారు.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని