కరెంట్‌ అఫైర్స్‌

60 ఏళ్ల వయసులో ‘మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌’ అందాల కిరీటం గెలుచుకుని వార్తల్లో నిలిచిన మహిళ ఎవరు? (ఈ వయసులో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర కెక్కారు.

Published : 02 Jul 2024 00:14 IST

మాదిరి ప్రశ్నలు

60 ఏళ్ల వయసులో ‘మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌’ అందాల కిరీటం గెలుచుకుని వార్తల్లో నిలిచిన మహిళ ఎవరు? (ఈ వయసులో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర కెక్కారు. ఈమె ఈ టైటిల్‌ గెలుపుతో ‘మిస్‌ యూనివర్స్‌ 2024’ పోటీలకు అర్జెంటీనా తరఫున పోటీపడే అవకాశం పొందారు. కానీ, ‘మిస్‌ యూనివర్స్‌ అర్జెంటీనా 2024’ పోటీల్లో ఈమె టైటిల్‌ సాధించలేకపోయారు. 29 ఏళ్ల మగలి బెనెజమ్‌ కోర్టే మిస్‌ యూనివర్స్‌ అర్జెంటీనా టైటిల్‌ నెగ్గారు. ఈమె ఈ ఏడాది  సెప్టెంబరులో మెక్సికోలో జరిగే మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీల్లో అర్జెంటీనా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. విశ్వసుందరి పోటీల్లో 18 నుంచి 28 ఏళ్ల లోపు వయసు వారే పాల్గొనాలన్న నిబంధనను 2023 నుంచి తొలగించడంతో వీరికి ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది.)

జ: అలెజాండ్రా మారిసా రోడ్రిగెజ్‌

విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మించిన తర్వాత తొలిసారిగా ఏ అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంది?

జ: ది వరల్డ్‌ ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌ షిప్‌

ప్రపంచ అండర్‌ - 8 చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచిన తెలంగాణ బాలుడు ఎవరు? (అల్బేనియాలో జరిగిన ప్రపంచ క్యాడెట్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-8 ఓపెన్‌ విభాగంలో విజేతగా నిలిచాడు. )

జ: ఆదుళ్ల దివిత్‌ రెడ్డి

ఇండియన్‌ వ్యాక్సిన్‌ మ్యాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? (రెండేళ్లపాటు ఈయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. ఐవీఎంఏ ఉపాధ్యక్షురాలిగా బయోలాజికల్‌ ఇ లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల ఎన్నికయ్యారు.)

జ: భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని