కరెంట్‌ అఫైర్స్‌

గ్రామాలకు హైస్పీడ్‌  ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌లను అందించి, డిజిటల్‌ విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో   ప్రధాని మోదీ ఏ రోజున డిజిటల్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు?

Updated : 01 Jul 2024 06:39 IST

మాదిరి ప్రశ్నలు

గ్రామాలకు హైస్పీడ్‌  ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌లను అందించి, డిజిటల్‌ విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో   ప్రధాని మోదీ ఏ రోజున డిజిటల్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు? (భారత్‌లోని 6.25 లక్షల గ్రామాల్లో, 2.50 లక్షల పల్లెలకు బ్రాడ్‌బ్యాండ్‌ అనుసంధానత కల్పించడానికి డిజిటల్‌ ఇండియా ఛత్రం కింద భారత్‌ నెట్‌ కార్యక్రమం చేపట్టారు. 2024, మార్చి 18 నాటికి 2.11 లక్షల గ్రామ పంచాయతీలకు వైఫై అనుసంధానత కల్పించారు. 9.24 లక్షల ఫైబర్‌ టు హోమ్‌ కనెక్షన్లను అందించారు.)

జ: 2015, జులై 1


ఇంటర్నెట్, సమాచార, ప్రసార సాంకేతికతలు సామాజిక, ఆర్థిక పురోగతికి ఎంతో కీలకం అనే విషయాన్ని ప్రపంచ ప్రజలకు తెలియజేయడానికి, డిజిటల్‌ అంతరాలను అధిగమించడానికి ఏటా ఏ తేదీన ప్రపంచ టెలీకమ్యూనికేషన్, సమాచార సంఘ దినోత్సవాన్ని (డబ్ల్యూటీఐఎస్‌డీ - వరల్డ్‌ టెలీకమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సొసైటీ డే) నిర్వహిస్తారు? (ఈ ఏడాది   డబ్ల్యూటీఐఎస్‌డీని ‘డిజిటల్‌ ఇన్నోవేషన్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌’ అనే థీమ్‌తో నిర్వహించారు.)

జ: మే 17


నాలుగేళ్లకు ఒకసారి జరిగే అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ల ప్రామాణీకరణ మహాసభ (డబ్ల్యూటీఎస్‌ఏ - వరల్డ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ స్టాండర్డైజేషన్‌ అసెంబ్లీ)ను 2024, అక్టోబరు 15-24 తేదీల్లో ఎక్కడ నిర్వహించనున్నారు? (ఐక్యరాజ్య సమితి అనుబంధ ‘అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ)’ దీన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ దేశాలకు రేడియోస్పెక్ట్రమ్‌ పంపిణీ, ఉపగ్రహ కక్ష్యల కేటాయింపు, ప్రపంచవ్యాప్త ప్రమాణాల నిర్దేశం, వర్ధమాన దేశాల్లో టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థల ఏర్పాటు బాధ్యతలను ఐటీయూ నిర్వహిస్తోంది.)

జ: దిల్లీ


సైబర్‌ మోసాల వల్ల 2023లో భారత్‌లో వినియోగదారులు ఎంత మొత్తాన్ని పోగొట్టుకున్నారని జాతీయ నేర గణాంక సంస్థ  (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక పేర్కొంది?

జ: రూ.7,489 కోట్లు 




గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని