కరెంట్‌ అఫైర్స్‌

దేశంలో 2017-18లో 92 కోట్లుగా నమోదైన యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌-ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ) లావాదేవీల సంఖ్య 2023-24 చివరికి ఎంత మొత్తానికి చేరుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి?

Published : 30 Jun 2024 00:54 IST

మాదిరి ప్రశ్నలు

  • దేశంలో 2017-18లో 92 కోట్లుగా నమోదైన యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌-ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ) లావాదేవీల సంఖ్య 2023-24 చివరికి ఎంత మొత్తానికి చేరుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి? (విశ్వవ్యాప్త డిజిటల్‌ లావాదేవీల్లో 46 శాతం వాటా భారత్‌దేనని వెల్లడైంది. యూపీఐ లావాదేవీల్లో 86 శాతం వరకు ఫోన్‌ పే, గూగుల్‌ పే పద్దుల్లోనే నమోదయ్యాయి.)

జ: 13,100 కోట్లు

అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? (ఏ సమాజంలోనైనా ప్రాథమిక వ్యవస్థ కుటుంబమే. అందుకే, ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలను ప్రభావితం చేస్తున్న అంశాల పట్ల అందరికీ అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఐరాస సర్వ ప్రతినిధి సభ 1993లో ఈ తేదీని అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవంగా ప్రకటించింది. ‘కుటుంబాలు - వాతావరణ మార్పులు’ అనేది ఈ ఏడాది ఈ దినోత్సవ నినాదం.)

జ: మే 15

విద్యార్థులను ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేయకుండా, చదువుల పట్ల ఆసక్తి కలిగించే ‘యుతోరీ’ విద్యా విధానాన్ని చేపట్టిన ఏ దేశం విద్యారంగంలో అపూర్వ ఫలితాలను సాధిస్తోంది? (‘నేను విన్నది మరచిపోతాను.. నేను చూసింది గుర్తుంచుకుంటాను.. నేను చేసేదానిపై అవగాహన పెంచుకుంటాను’ అనే సూత్రం ఈ దేశ విద్యా విధానానికి వెన్నెముక. ఆచరణ ద్వారా అభ్యసనం అనే ఈ సూత్రం ఈ దేశంలో ప్రాజెక్టు ఆధారిత అభ్యసన (పీబీఎల్‌)కు పునాది వేసింది.)

జ: జపాన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని