నోటిఫికేషన్స్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాల్లో మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Published : 30 Jun 2024 00:51 IST

ఎస్‌ఎస్‌సీ - ఎంటీఎస్‌, హవల్దార్‌ ఉద్యోగాలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాల్లో మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 8,326. దరఖాస్తు రుసుము రూ.100. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈఎస్‌ఐసీ, కోల్‌కతాలో ఫ్యాకల్టీ పోస్టులు

పశ్చిమ బెంగాల్‌, కోల్‌కతా జోకాలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ)- పీజీఐఎంఎస్‌ఆర్‌ అండ్‌ ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ మైక్రోబయాలజీ, పాథలాజీ, రేడియాలజీ, అనస్థీషియా విభాగాల్లో 73 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. దరఖాస్తు ఫీజు రూ.500. అర్హులైన అభ్యర్థులు 2024, జులై 4, 5 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు.

ఐఐఎం జమ్మూలో స్పెషలిస్ట్‌, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

జమ్మూ-కశ్మీర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ జమ్మూ (ఐఐఎం- జమ్మూ) ఒప్పంద ప్రాతిపదికన టీమ్‌ లీడర్‌, స్పెషలిస్ట్స్‌, యంగ్‌ ప్రొఫెషనల్స్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 16. అర్హులైన అభ్యర్థులు 2014 జులై 16 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని