కరెంట్‌ అఫైర్స్‌

18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా 2024, జూన్‌ 26న మరోసారి ఎన్నికయ్యారు. ఈయన ప్రస్తుతం రాజస్థాన్‌లోని కోటా స్థానం నుంచి భాజపా తరఫున ఎంపీగా గెలిచారు. ఈ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. 

Published : 29 Jun 2024 00:44 IST

18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా 2024, జూన్‌ 26న మరోసారి ఎన్నికయ్యారు. ఈయన ప్రస్తుతం రాజస్థాన్‌లోని కోటా స్థానం నుంచి భాజపా తరఫున ఎంపీగా గెలిచారు. ఈ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. 

  • మూజువాణి పద్ధతిలో ఓం బిర్లా తన ప్రత్యర్థి విపక్ష కూటమి అభ్యర్థి, కేరళ ఎంపీ కె.సురేశ్‌పై విజయం సాధించారు.
  • 17వ లోక్‌సభ కాలంలో (2019-24) ఓం బిర్లా స్పీకర్‌గా పనిచేశారు.

పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టుకు హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యం వహించనున్నాడు. 2024, జులైలో ప్రారంభంకానున్న ఒలింపిక్స్‌ కోసం 16 మంది ఆటగాళ్లతో భారత జట్టును హాకీ ఇండియా 2024, జూన్‌ 26న ప్రకటించింది. హార్దిక్‌ సింగ్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.


ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి ‘నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)’కు సెక్రెటరీ జనరల్‌గా డచ్‌ ప్రధానమంత్రి మార్క్‌ రుట్టే 2024, జూన్‌ 26న నియమితులయ్యారు. బ్రసెల్స్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రుట్టే నియామకాన్ని నాటో రాయబారులు ఆమోదించారు.


 

రాడార్‌ సిగ్నళ్లకు అందకుండా ఉండటంతోపాటు రక్షణ వ్యవస్థల చుట్టూ మైక్రోవేవ్‌ కవచంలా పనిచేసే సాంకేతికతను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) 2024, జూన్‌ 26న భారతీయ నౌకా దళానికి అందజేసింది. మధ్య శ్రేణి-మైక్రోవేవ్‌ అబ్‌స్క్యూరెంట్‌ చాఫ్‌ రాకెట్‌ (ఎంఆర్‌-ఎంవోసీఆర్‌) అనే ఈ వ్యవస్థను డీఆర్‌డీవో జోధ్‌పుర్‌ యూనిట్‌ రూపొందించింది. 

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


మాదిరి ప్రశ్నలు

ఇటీవల వార్తల్లోకి వచ్చిన క్రెమ్లిన్‌ ప్యాలెస్‌ ఏ దేశాధ్యక్ష భవనం?

జ: రష్యా (రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ 2024, మే 7న అయిదోసారి మాస్కోలోని క్రెమ్లిన్‌ ప్యాలెస్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. 2500 మంది ముఖ్య అతిథుల సమక్షంలో పుతిన్‌ రష్యా రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి  అమెరికా, యూకే, జర్మనీ దౌత్యవేత్తలు గైర్హాజరయ్యారు. ఆరేళ్ల పదవీ కాలానికిగానూ 2030 వరకు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.)

2024, మే 14 నుంచి 25 వరకు ఫ్రాన్స్‌లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక కేన్స్‌ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైన భారతీయ చలన చిత్రం ఏది? (ఈ చిత్రానికి పాయల్‌ కపాడియా దర్శకత్వం వహించారు. గ్రాండ్‌ ప్రిక్స్‌ పురస్కారాన్ని ఈ సినిమా గెలుచుకుంది. భారత్‌కు చెందిన ముగ్గురు యువ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆస్థా షా, ఆర్‌జే కరిష్మా, నిహారికా ఎన్‌.ఎమ్‌లు అతిరథ మహారథులతో కలిసి ఈ చలన చిత్రోత్సవంలో రెడ్‌ కార్పెట్‌ మీద నడిచి వార్తల్లో నిలిచారు. ‘ది సెకండ్‌ యాక్ట్‌’ ను ప్రారంభ చిత్రంగా, ‘అనోరా’ను ముగింపు సినిమాగా తాజా కేన్స్‌ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు.   ప్రతిష్ఠాత్మక ‘పామ్‌ డి ఓర్‌’ పురస్కారాన్ని ‘అనోరా’  గెలుచుకుంది.)

జ: ఆల్‌ వియ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌

2024 ఏప్రిల్, మే నెలల్లో ఆసియా అండర్‌-22 యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను ఎక్కడ నిర్వహించారు? (భారత్‌ ఈ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 43 (12 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలు) పతకాలతో పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఆతిథ్య దేశం మొత్తం 48 పతకాలతో అగ్ర స్థానంలో నిలిచింది.)

జ: కజకస్థాన్‌ రాజధాని ఆస్థానా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని