కరెంట్‌ అఫైర్స్‌

జీఎస్‌టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (జీఎస్‌టీఏటీ) తొలి అధ్యక్షుడిగా 2024, మే 6న ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టారు? (కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ దిల్లీలో ఈయనతో ప్రమాణం స్వీకారం చేయించారు.

Published : 28 Jun 2024 00:14 IST

మాదిరి ప్రశ్నలు

  • జీఎస్‌టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (జీఎస్‌టీఏటీ) తొలి అధ్యక్షుడిగా 2024, మే 6న ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టారు? (కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ దిల్లీలో ఈయనతో ప్రమాణం స్వీకారం చేయించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కమిటీ ఈయనను ఎంపిక చేసింది. జీఎస్‌టీ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయ్యే అప్పీళ్లను విచారించేందుకు జీఎస్‌టీఏటీ ఏర్పాటైంది.)

జ: జస్టిస్‌ (రిటైర్డ్‌) సంజయ్‌ కుమార్‌ మిశ్రా

  • వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో ఎంత మొత్తం వసూలై రికార్డు సృష్టించాయి? (2017, జులైలో జీఎస్‌టీ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023, ఏప్రిల్‌లో   నమోదైన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటివరకు రికార్డుగా ఉన్నాయి. 2023, ఏప్రిల్‌తో పోలిస్తే తాజా వసూళ్లు 12.4 శాతం అధికం. 2024, ఏప్రిల్‌; 2023, ఏప్రిల్‌; 2024, మార్చి; 2024, జనవరి; 2023 అక్టోబరులు ఇప్పటివరకు టాప్‌-5 జీఎస్‌టీ నెలవారీ వసూళ్లను నమోదు చేశాయి.)

జ: రూ.2,10,267 కోట్లు

  • 2024, మేలో జువైనల్‌ జస్టిస్‌ (బాలల నేర న్యాయవ్యవస్థ) అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించారు? (భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.)

జ: నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూ

​​​​​​​


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని