నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) - డీపీఆర్‌

Published : 28 Jun 2024 00:14 IST

రోడ్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్‌ ఉద్యోగాలు

న్యూదిల్లీలోని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) - డీపీఆర్‌ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన ప్రిన్సిపల్‌ డీపీఆర్‌ ఎక్స్‌పర్ట్‌, సీనియర్‌ హైవే ఎక్స్‌పర్ట్‌, రోడ్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్‌, ట్రాఫిక్‌ ఎక్స్‌పర్ట్‌, ఎన్విరాన్‌మెంట్‌/ ఫారెస్ట్‌ స్పెషలిస్ట్‌, ల్యాండ్‌ అక్విజిషన్‌ ఎక్స్‌పర్ట్‌, జియోటెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌, బ్రిడ్జ్‌ ఎక్స్‌పర్ట్‌, టన్నెల్‌ ఎక్స్‌పర్ట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 38. అర్హులైన అభ్యర్థులు 18 జులై 2024లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అగ్నివీర్‌ (ఎంఆర్‌ మ్యుజీషియన్‌) పోస్టులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా భారత నౌకాదళంలో అగ్నివీర్‌ (ఎంఆర్‌ మ్యుజీషియన్‌) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ప్రారంభమయ్యే 02/2024 (నవంబరు 24) బ్యాచ్‌ పేరున శిక్షణ ఉంటుంది. అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో జులై 1 నుంచి జులై 11లోపు దరఖాస్తు చేసుకోవాలి.

లేటరల్‌ ఎంట్రీ బీటెక్‌ ప్రోగ్రామ్‌

విశాఖపట్నంలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ సెషన్‌ 2024-25కు సంబంధించి లేటరల్‌ ఎంట్రీ బీటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు రుసుము రూ.1000. ఆసక్తి ఉన్నవారు జులై 5 లోగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని