కరెంట్‌ అఫైర్స్‌

టీ20 ప్రపంచ కప్‌ - 2024, బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరు? (2024, జూన్‌ 1 నుంచి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలో ఈ టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో వెస్టిండీస్‌ జట్టులో భాగమైన జమైకా దేశ క్రీడాకారుడిని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఈ టోర్నీ బ్రాండ్‌  అంబాసిడర్‌గా ఎంపిక చేసింది.

Updated : 27 Jun 2024 00:30 IST

మాదిరి ప్రశ్నలు

టీ20 ప్రపంచ కప్‌ - 2024, బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరు? (2024, జూన్‌ 1 నుంచి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలో ఈ టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో వెస్టిండీస్‌ జట్టులో భాగమైన జమైకా దేశ క్రీడాకారుడిని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఈ టోర్నీ బ్రాండ్‌  అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. కొన్నేళ్ల కిందటే ఆటకు వీడ్కోలు పలికిన ఈ ఫాస్టెస్ట్‌ స్ప్రింటర్‌ పేరిట ప్రస్తుతం 100, 200 మీటర్ల ప్రపంచ రికార్డులున్నాయి. తాజా టోర్నీలో మొత్తం 20 జట్లు పోటీ పడుతున్నాయి.)

జ: ఉసేన్‌ బోల్ట్‌

దేశంలోనే అత్యంత తేలికపాటి తూటా రక్షణ కవచాన్ని డీఆర్‌డీవోకు చెందిన డీఎంఎస్‌ఆర్‌డీఈ (డిఫెన్స్‌ మెటీరియల్స్‌ అండ్‌ స్టోర్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌) ఇటీవల అభివృద్ధి చేసింది. ఇది ఏ నగరంలో ఉంది? (ఈ తూటా రక్షణ కవచం అత్యధిక స్థాయి ‘లెవల్‌ 6’ ముప్పు నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని సంస్థ వెల్లడించింది. దీన్ని  మోనోలిథిన్‌ సిరామిక్‌ ప్లేటు, పాలిమర్‌తో తయారు చేసినట్లు పేర్కొంది. ఇది         7.62 × 54 ఆర్‌ఏపీఐ తూటాలను నిలువరిస్తుందని  శాస్త్రవేత్తలు వెల్లడించారు.)

జ: కాన్పుర్‌

రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? (ఇటీవల కోల్‌కతాలో మరణించిన మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందాజీ మహారాజ్‌ వారసుడిగా ఈ 95 ఏళ్ల స్వామి బాధ్యతలు చేపట్టారు. ఈయన రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ల 17వ అధ్యక్షుడిగా వార్తల్లో నిలిచారు.)

జ: స్వామి గౌతమానంద్‌ జీ మహారాజ్‌

భారత్‌ ఎకానమీ ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిట్‌ ఇండియా సంస్థ ఇటీవల అంచనా వేసింది?

జ: 6.6 శాతం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు