ఏరోనాటికల్‌ చదివాక?

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ మూడో ఏడాది చదువుతున్నాను. ఈ కోర్సుతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏ ఉద్యోగావకాశాలుంటాయి? 

Published : 26 Jun 2024 01:18 IST

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ మూడో ఏడాది చదువుతున్నాను. ఈ కోర్సుతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏ ఉద్యోగావకాశాలుంటాయి? 

సాయి హరిణి

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో), డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ), హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌ (ఎన్‌ఏఎల్‌), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లలో ఉద్యోగాలుంటాయి. సాధారణంగా ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఏరోస్పేస్, ఏరోడైనమిక్, ఫ్లైట్‌ మెకానిక్స్, ఫ్లైట్‌ సిస్టమ్స్‌ టెస్ట్‌ ఇంజినీర్లుగా, ఇంకా ఎయిర్‌క్రాఫ్ట్‌ డిజైన్, ఏవియానిక్స్, మోడలింగ్, సిస్టమ్, ప్రొపల్షన్, రాకెట్‌ ఇంజినీర్లుగా చేరవచ్చు. అలాగే ఎయిర్‌ సేఫ్టీ ఆఫీసర్లుగా, సైంటిస్టులుగా స్థిరపడవచ్చు. ప్రైవేటు ఎయిర్‌ లైన్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ సంస్థల్లో కూడా ఉద్యోగాలు లభిస్తాయి.

ఏరోనాటిక్స్‌కు సంబంధించిన రంగాల్లో రాణించాలంటే మ్యాథమెటికల్‌/ అనలిటికల్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు, సాంకేతిక, భావ ప్రసార నైపుణ్యాలు, సృజనాత్మకత చాలా అవసరం. ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడే ఏరోనాటికల్‌ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ చేస్తే నైపుణ్యాలు మెరుగై ఈ రంగంలో మంచి ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. ఏరోనాటిక్స్‌ రంగానికి సంబంధించిన సర్టిఫికెట్‌ కోర్సులను ఆన్‌లైన్‌లో పూర్తి చేయడం వల్ల మీ సాంకేతిక విషయ పరిజ్ఞానం పెరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని