నోటీసు బోర్డు

తమిళనాడు, కల్పకంలోని అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌ వివిధ  విభాగాల్లో 91 ఖాళీల భర్తీకి డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.

Published : 19 Jun 2024 00:48 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఐజీసీఏఆర్‌లో సైంటిఫిక్‌ ఆఫీసర్లు 

తమిళనాడు, కల్పకంలోని అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌ వివిధ  విభాగాల్లో 91 ఖాళీల భర్తీకి డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.

  • సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 34  ్ర టెక్నికల్‌ ఆఫీసర్‌: 01  
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 12
  • నర్స్‌: 27  
  • ఫార్మసిస్ట్‌: 14
  • టెక్నీషియన్‌: 03  

విభాగాలు: జనరల్‌ సర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్, డెంటల్‌ ప్రోస్టోడాంటిక్స్, అనస్థీషియా, గైనకాలజీ, ఆఫ్తాల్మాలజీ, రేడియాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్‌టీ, న్యూక్లియర్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, హ్యూమన్‌/మెడికల్‌ జెనెటిస్ట్, జనరల్‌ డ్యూటీ/ క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్, ఫిజియోథెరపీ, మెడికల్‌ సోషల్‌ వర్కర్, పాథాలజీ, రేడియోగ్రఫి, న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజిస్ట్, ఆర్థోపెడిక్‌ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, నర్సింగ్, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, ఎండీఎస్, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం.
వయసు: పోస్టులను అనుసరించి 18 నుంచి 50 ఏళ్లు ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు పోస్టు కోడ్‌ను అనుసరించి పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: దేశంలోని ప్రధాన నగరాల్లో.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2024.
వెబ్‌సైట్‌: https://www.igcar.gov.in/


మేనేజ్‌లో ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌లు 

హైదరాబాదు రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (మేనేజ్‌) కింది ఖాళీల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.

  •  మేనేజ్‌ ఫెలో: 02 
  •  ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ (అకడమిక్‌): 01 
  •  ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఐటీ): 01 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం, హిందీ, స్థానిక భాషల్లో అవగాహన.
జీతం: మేనేజ్‌ ఫెలో పోస్టుకు రూ.75,000. ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూ.36,000.
వయసు: మేనేజ్‌ ఫెలో పోస్టుకు 45 ఏళ్లు, ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు 40 ఏళ్లు మించకూడదు.
ఉద్యోగ స్థానం: జమ్ము, శ్రీనగర్‌.
ఎంపిక: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా.
గూగుల్‌ ఫాం ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: 28-06-2024.
వెబ్‌సైట్‌:https://www.manage.gov.in/


పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు  

దిల్లీలోని ఫార్మాస్యూటికల్స్‌ అండ్‌ మెడికల్‌ డివైజెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా (పీఎంబీఐ) 44 ఖాళీల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.

  • అసిస్టెంట్‌ మేనేజర్‌: 10  
  • సీనియర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌: 12 
  • ఎగ్జిక్యూటివ్‌: 12  
  • సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 10 

విభాగాలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్, క్వాలిటీ, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, ఐటీ అండ్‌ ఎంఐఎస్, హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మిన్, లీగల్‌. అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బీఫార్మసీ, పీజీతో పాటు పని అనుభవం.
దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.
పోస్టు ద్వారా దరఖాస్తుకు చిరునామా: సీఈఓ, పీఎంబీఐ, బీ-500, టవర్‌ బీ, ఐదో అంతస్తు, వరల్డ్‌ట్రేడ్‌ సెంటర్, నౌరోజీనగర్, న్యూదిల్లీ. ఎంపిక: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 08-07-2024.
వెబ్‌సైట్‌: https://janaushadhi.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని