నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్‌ఈసీ పవర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్‌ (ఆర్‌ఈసీ పీడీసీఎల్‌).. 25 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 03 Jul 2024 00:39 IST

ఉద్యోగాలు
ఆర్‌ఈసీ పీడీసీఎల్‌లో డిప్యూటీ మేనేజర్లు 

భారత ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్‌ఈసీ పవర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్‌ (ఆర్‌ఈసీ పీడీసీఎల్‌).. 25 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • డిప్యూటీ మేనేజర్‌: 09
  • ఆఫీసర్‌: 16 
  • విభాగాలు: ఇంజినీరింగ్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, హ్యూమన్‌ రిసోర్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంపెనీ సెక్రటేరియట్, లా, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌/ బీఈ/ బీటెక్, ఎంబీఏ, సీఏ/ సీఎంఏ/ ఎంసీఏ/ ఎంటెక్‌/ ఎంసీఎస్‌/ ఎంఎస్సీ/ ఐటీ/ లా/ పీజీడీఎం/ పీజీడీతో పాటు పని అనుభవం.

వేతనం: ఏడాదికి డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు రూ.13.5 లక్షలు, ఆఫీసర్‌ పోస్టులకు రూ.9 లక్షలు.

వయసు: డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 39 ఏళ్లు, ఆఫీసర్‌ పోస్టులకు 33 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-07-2024.

వెబ్‌సైట్‌: https://www.recpdcl.in/


నిట్‌ అగర్తలాలో నాన్‌ టీచింగ్‌ ఖాళీలు 

త్రిపుర రాష్ట్రం అగర్తలలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. 9 నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • డిప్యూటీ రిజిస్ట్రార్‌: 03  
  • అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌: 03  
  • ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్‌): 01 
  • సైంటిఫిక్‌/ టెక్నికల్‌ ఆఫీసర్‌: 02 
  • అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వేతనం: డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టుకు నెలకు రూ.78,800, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్, సైంటిఫిక్‌/ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.56,100.

దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీలకు రూ.500. మహిళలు, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, సెలక్షన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02-08-2024.

వెబ్‌సైట్‌: https://nita.ac.in/


వాక్‌-ఇన్‌ 

ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టులు  

ముంబయిలోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ రిప్రొడక్టివ్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3: 01 
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-1: 01  

అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి టెన్త్, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వేతనం: నెలకు ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-ఖిఖిఖి పోస్టుకు రూ.35,560, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-ఖి పోస్టుకు రూ.22,860.

వయసు: ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-ఖిఖిఖి పోస్టుకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-ఖి పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: జులై 16.

వేదిక: ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ రిప్రొడక్టివ్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్, జేఎం స్ట్రీట్, పారెల్, ముంబయి.

వెబ్‌సైట్‌: https://nirrch.res.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని