నోటీస్‌బోర్డు

దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్కు ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనెల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 02 Jul 2024 00:16 IST

ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 కొలువులు  

దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్కు ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనెల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 105, తెలంగాణలో 104 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం.
వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్స్‌ రాత పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు రూ.175. ఇతరులకు రూ.850.
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జులై 21.
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 24, 25, 31.
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదల: సెప్టెంబరు, 2024.
ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష: 13 అక్టోబరు, 2024.
పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్‌. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం.
వెబ్సైట్‌: https://www.ibps.in/


వాక్‌-ఇన్స్‌

ఎన్‌ఆర్‌ఆర్‌ఐలో సీఈఓ పోస్టులు  

డిశా రాష్ట్రం కటక్‌లోని ఐసీఏఆర్‌- నేషనల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఆర్‌ఆర్‌ఐ).. తాత్కాలిక ప్రాతిపదికన 3 చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) పోస్టు భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

అర్హత: డిగ్రీతో పాటు హైబ్రిడ్‌ రైస్‌ సీడ్‌ ప్రొడక్షన్లో రెండేళ్ల పని అనుభవం.
వేతనం: నెలకు రూ.25,000.
వయసు: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ: 24-07-2024.
వేదిక: ఐసీఏఆర్‌-నేషనల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, కటక్‌.
పని ప్రదేశం: ఐసీఏఆర్‌-నేషనల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, కటక్‌.
వెబ్‌సైట్‌: https://icar-nrri.in/

బాపట్లలో టీచింగ్‌ అసోసియేట్లు

బాపట్లలోని డా.ఎన్టీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌... ఒప్పంద ప్రాతిపదికన 2 టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంటెక్, పీహెచ్‌డీతో పాటు టీచింగ్‌ అనుభవం.
వేతనం: నెలకు రూ.54,000. ఇంటర్వ్యూ తేదీ: జులై 04.
వేదిక: బాపట్లలోని డా.ఎన్టీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌.
వెబ్‌సైట్‌: https://angrau.ac.in/


ప్రవేశాలు

మెడ్‌స్కిల్స్‌ కళాశాలలో వైద్య కోర్సులు

శ్రీకాకుళంలోని బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ కళాశాల వివిధ వైద్య కోర్సులకు సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

బీఎస్సీ: ట్రాన్స్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ, ఫిజిషియన్‌ అసిస్టెంట్, ఎనస్థీషియాలజీ టెక్నీషియన్, కార్డియాక్‌ కేర్‌ టెక్నాలజీ, ఇమేజింగ్‌ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ టెక్నాలజీ, న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, మెడికల్‌ రికార్డ్స్‌ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ, రెనల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ, పర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ.

ఇవేకాక బీఎస్సీ నర్సింగ్‌ (4 ఏళ్లు) నర్సింగ్‌ జీఎన్‌ఎం (3 ఏళ్లు), ఎం.ఎల్‌.టీ(3 ఏళ్లు), బీపీటీ (4.5 ఏళ్లు) కోర్సులున్నాయి.

పీజీ: మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ, హెల్త్‌కేర్‌ అడ్మినిస్ట్రేషన్, ఎమ్మెస్సీ నర్సింగ్‌.
పీజీ డిప్లొమా: క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌ టెక్నాలజీ, గాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ, మరికొన్ని 14 డిప్లొమా కోర్సులు.
అర్హతలు: కోర్సును అనుసరించి ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌.
వెబ్‌సైట్‌: www.bollinenimedskills.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని