ఉద్యోగాలు

జమ్మూలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ జమ్మూ (ఐఐఎం- జమ్మూ) .. ఒప్పంద ప్రాతిపదికన 16 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 01 Jul 2024 00:02 IST

ఐఐఎం జమ్మూలో..

మ్మూలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ జమ్మూ (ఐఐఎం- జమ్మూ) .. ఒప్పంద ప్రాతిపదికన 16 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • యంగ్‌ ప్రొఫెషనల్స్‌: 08 
  • టీమ్‌ లీడర్‌: 01 
  • స్పెషలిస్ట్‌లు: 07 

విభాగాలు: ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ పీపీపీ (కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌/ కాన్‌సెషనల్‌ అగ్రిమెంట్‌), పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఎకనామిక్స్, అగ్రికల్చర్‌ అండ్‌ అల్లైడ్‌ సెక్టార్స్, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ అండ్‌ వాల్యూ చైన్‌ డెవలప్‌మెంట్, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌-లైవ్లీహుడ్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ క్రెడిట్‌ లింకేజ్‌ ఎక్స్‌పర్ట్, అర్బన్‌ డెవలప్‌మెంట్థ్‌ టౌన్‌ ప్లానింగ్, టూరిజం.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వయసు: టీమ్‌ లీడర్‌ పోస్టుకు 65 ఏళ్లు, స్పెషలిస్ట్‌ పోస్టుకు 60 ఏళ్లు, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుకు 45 ఏళ్లు ఉండాలి.

వేతనం: టీమ్‌ లీడర్‌ పోస్టుకు రూ.2 లక్షలు, స్పెషలిస్ట్‌ పోస్టుకు రూ.1.5 లక్షలు, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుకు రూ.50,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-07-2024.

వెబ్‌సైట్‌:https://www.iimj.ac.in/


వాక్‌-ఇన్స్‌

సాయిల్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్‌ సైన్స్‌.. తాత్కాలిక ప్రాతిపదికన 2 ఖాళీల భర్తీకి ఇంటర్వ్వూలు నిర్వహిస్తోంది.

  • సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01
  • యంగ్‌ ప్రొఫెషనల్‌-ఖి: 01  

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు నెట్‌/ గేట్‌ స్కోరు, పని అనుభవం.

వేతనం: నెలకు సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుకు రూ.31,000. యంగ్‌ ప్రొఫెషనల్‌-ఖికు రూ.30,000.

వయసు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుకు మహిళలకు గరిష్ఠంగా 40 ఏళ్లు, పురుషులకు 35 ఏళ్లు, యంగ్‌ ప్రొఫెషనల్‌-ఖి పోస్టుకు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: జులై 5, 8.

వేదిక: ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్‌ సైన్స్, నబీభాగ్, బెరాసీయా రోడ్, భోపాల్, మధ్యప్రదేశ్‌.

వెబ్‌సైట్‌: https://iiss.icar.gov.in/


సీఆర్‌ఐడీఏలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌  

హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రై ల్యాండ్‌ అగ్రికల్చర్‌ (సీఆర్‌ఐడీఏ).. 
2 యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ (అగ్రికల్చర్‌ సైన్స్‌)తో పాటు పని అనుభవం.

వయసు: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ.30,000. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 05-07-2024.

వేదిక: క్రిడా, సంతోష్‌నగర్, సైదాబాద్‌ పోస్టు, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌:https://www.icar-crida.res.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని