నోటిఫికేషన్స్‌

భారత నౌకాదళంలో సెయిలర్‌ (స్పోర్ట్స్‌ కోటా ఎంట్రీ 02/2024 బ్యాచ్‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. 10+2 ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు.

Published : 29 Jun 2024 00:40 IST

సెయిలర్‌ (స్పోర్ట్స్‌ కోటా ఎంట్రీ) పోస్టులు

భారత నౌకాదళంలో సెయిలర్‌ (స్పోర్ట్స్‌ కోటా ఎంట్రీ 02/2024 బ్యాచ్‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. 10+2 ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్న వారు 2024, జులై 20 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు

కర్ణాటక, మాల్పేలోని ఉడిపి షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన మెకానికల్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, స్కాఫ్‌ఫోల్డింగ్, హెచ్‌ఆర్‌ విభాగాల్లో సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 16. దరఖాస్తు ఫీజు రూ.300. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 12 జులై 2024.


ఆపరేటర్‌ పోస్టులు

మహారాష్ట్ర నాసిక్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, సివిల్, ఫిట్టర్‌ విభాగాల్లో ఆపరేటర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 58. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 30 జూన్‌ 2024.

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని