ప్రభుత్వ ఉద్యోగాలు

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌్).. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగాల్లోని 51 ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది

Published : 24 Jun 2024 00:25 IST

హాల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు 

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌్).. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగాల్లోని 51 ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది

  • డిప్లొమా టెక్నీషియన్‌ 
  • ఆపరేటర్‌
  • అసిస్టెంట్‌

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్‌ వర్క్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, మెటలర్జీ, ఫిట్టర్, గ్రైండర్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఏ/బీఎస్సీ/బీకాం, డిప్లొమా ఇంజినీరింగ్‌. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, మెటలర్జీలలో జనరల్‌/ఓబీసీ/ ఈడబ్య్లూఎస్‌ అభ్యర్థులు 60 శాతం మార్కులతో.. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్, డిప్లొమా, ఐటీఐ, బీఏ, బీఎస్సీ, బీకాం పూర్తిచేయాలి. సర్టిఫికేషన్‌ కోర్సు ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ లకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు డిప్లొమా టెక్నీషియన్‌ పోస్టుకు రూ. 48,511. అపరేటర్, అసిస్టెంట్‌ పోస్టులకు రూ.46,554. దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26-06-2024.

వెబ్‌సైట్‌:https://hal-india.co.in/ 


వాక్‌-ఇన్‌

సీఐఆర్‌బీలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌  

హరియాణ రాష్ట్రం హిసార్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ బఫెలోస్‌.. 2 యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: అగ్రికల్చర్‌/డిప్లొమా సైన్స్‌లో డిగ్రీ.
వయసు: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌:purchase.cirb@icar.gov.in
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
వెబ్‌సైట్‌:https://cirb.icar.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు