నోటీస్‌బోర్డు

హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రిసెర్చ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 18 Jun 2024 00:23 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
రైస్‌ రిసెర్చ్‌ సంస్థలో.. 

హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రిసెర్చ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01 
  • యంగ్‌ ప్రొఫెషనల్‌: 01 
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌: 01  
  • అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వేతనం: నెలకు సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుకు రూ.35,000, యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.30,000, టెక్నికల్‌ అసిస్టెంట్‌కు రూ.15,000.

వయసు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుకు పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు. ఇతర పోస్టులకు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా.

ఈమెయిల్‌:  victornpet@gmail.com

దరఖాస్తుకు చివరి తేదీ: 26-06-2024.

వెబ్‌సైట్‌: www.icar-iirr.org/ 


ఐఐఓఆర్‌లో రిసెర్చ్‌ ఫెలో పోస్టులు 

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌.. ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టులకి దరఖాస్తులు కోరుతోంది.

  • జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 07 
  • యంగ్‌ ప్రొఫెషనల్‌-1:  05  

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, నెట్‌/ గేట్‌ స్కోరు, పని అనుభవం.

వేతనం: నెలకు జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుకు రూ.37,000, యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.30,000.

వయసు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుకు మహిళలు 40 ఏళ్లు, పురుషులు 35 ఏళ్లు మించకూడదు. యంగ్‌ ప్రొఫెషనల్‌కు 21-45 ఏళ్ల మధ్య ఉండాలి.

గూగుల్‌ ఫాం ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: 08-07-2024.

వెబ్‌సైట్‌: https://icar-iior.org.in/ 


ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డులో.. 
ర్ణాటక రాష్ట్రం మాల్పేలోని ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో 13 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకి దరఖాస్తులు కోరుతోంది.

  • అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌: 02  
  • సీనియర్‌ మేనేజర్‌: 01
  • మేనేజర్‌: 09 
  • డిప్యూటీ మేనేజర్‌: 01  

విభాగాలు: ఇంజినీరింగ్, యూ అండ్‌ ఎం-డాక్‌ మాస్టర్, హెచ్‌ఎస్‌ఈ, కాంట్రాక్ట్‌ సెల్, ప్లానింగ్, హల్, ఎలక్ట్రికల్, అకామడేషన్‌ అవుట్‌ఫిట్, హల్‌ క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ కంట్రోల్‌- ఇంజినీరింగ్, పైపింగ్, మెషినరీ, ఫైనాన్స్‌.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, సీఏ, సీఎంఏతో పాటు పని అనుభవం.

వేతనం: నెలకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.1,50,160. సీనియర్‌ మేనేజర్‌కు రూ.1,31,390. మేనేజర్‌కు రూ.1,12,620. డిప్యూటీ మేనేజర్‌కు రూ.93,850.

వయసు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు 50 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్, మేనేజర్‌ పోస్టులకు 40 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్, పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు: 26-06-2024.

వెబ్‌సైట్‌:  https://udupicsl.com/


వాక్‌-ఇన్స్‌

అటామిక్‌ ఎనర్జీ స్కూల్లో..

ద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు, అశ్వాపురంలోని అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌.. ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. పీఆర్‌టీ (తెలుగు, ఈఎంఎస్‌)
2. టీజీటీ (ఇంగ్లిష్, సోషల్‌ సైన్స్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌).

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ, డీఎడ్, బీఎడ్‌.

వేతనం: నెలకు పీఆర్‌టీ పోస్టుకు రూ.21,250, టీజీటీ పోస్టుకు రూ.26,260.

వయసు: పీఆర్‌టీ పోస్టుకు పురుషులు 40 ఏళ్లు, మహిళలు 50 ఏళ్లు; టీఆర్‌టీ పోస్టుకు పురుషులు 45 ఏళ్లు, మహిళలు 55 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీ: 20-06-2024.

వేదిక: అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్, అశ్వాపురం, మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

వెబ్‌సైట్‌:  https://aecsmanuguru.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని